News March 29, 2024
‘ఫోన్ నంబర్లు మార్చలేక చస్తున్నాం’

TG: రాష్ట్రంలో వలస నేతలతో రాజకీయం హీటెక్కుతోంది. ఈ పరిణామాలపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘తెల్లారేసరికి ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావడం లేదు. ఫోన్లో వాళ్ల పేరు వెనుకో ముందో పార్టీ పేరు తగిలించి సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ మార్చలేక చస్తున్నాం’ అని కొందరు, ‘ఒకప్పుడు.. బెల్లం చుట్టూ ఈగలు. ఇప్పుడు.. అధికారం చుట్టూ నేతలు’ అంటూ మరికొందరు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
Similar News
News January 29, 2026
చైనాలో 11 మందికి మరణశిక్ష అమలు

క్రూరమైన మింగ్ మాఫియా ఫ్యామిలీకి చెందిన 11 మంది కీలక సభ్యులకు చైనా కోర్టు విధించిన మరణశిక్షను తాజాగా అమలు చేశారు. హత్యానేరం, అక్రమ నిర్బంధం, గ్యాంబ్లింగ్ వంటి 14 రకాల నేరాల్లో వీరు దోషులుగా తేలడంతో సెప్టెంబర్ 2025లో జెజియాంగ్ కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మయన్మార్ సరిహద్దు కేంద్రంగా వీళ్లు సుమారు $1.4 బిలియన్ల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
News January 29, 2026
ఒట్రోవర్ట్ గురించి తెలుసా?

ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, ఆంబ్రివర్ట్ అనే పదాలు వ్యక్తిత్వాన్ని సూచించేందుకు వాడతారు. అయితే ఒట్రోవర్ట్ లక్షణాలున్నవారు ఇంట్రోవర్ట్స్, ఎక్స్ట్రోవర్ట్స్ కలిపి పరిస్థితులకు తగ్గట్లు మారిపోతూ ఉంటారు. వీరు ప్రత్యేకమైన సంబంధ శైలిని కలిగి ఉంటారంటున్నారు నిపుణులు. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ మధ్య స్పష్టమైన మూడ్ స్వింగ్‌లను అనుభవించే వ్యక్తులను వివరించడానికి ఒట్రోవర్ట్ పదాన్ని ఉపయోగిస్తున్నారు.
News January 29, 2026
కేసీఆర్‌కు మూడోసారి నోటీసులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ CM KCRకు పోలీసులు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది. గతంలోనూ ఆయనకు వేర్వేరు ఇష్యూల్లో నోటీసులు అందాయి. INC అధికారంలోకి వచ్చిన తర్వాత PPAలపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది. దానిపై KCR హైకోర్టుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కూలడంపై ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషనూ నోటీసులిచ్చింది. KCR ఆ కమిషన్ ముందు హాజరయ్యారు.


