News February 10, 2025

అదానీ హెల్త్ సిటీని ప్రారంభిస్తున్నాం: గౌతమ్ అదానీ

image

వైద్య రంగంలో భారీ పెట్టుబడికి అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. రూ.6వేల కోట్ల పెట్టుబడితో అదానీ హెల్త్ సిటీని లాంచ్ చేయనున్నట్లు ఆ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వెల్లడించారు. మయో క్లినిక్ భాగస్వామ్యంతో అహ్మదాబాద్, ముంబైలో 1000 పడకల చొప్పున ఆస్పత్రులు నిర్మిస్తామని ప్రకటించారు. ఆస్పత్రులతో పాటు మెడికల్ కాలేజీలు కూడా నిర్మిస్తామన్నారు. దీంతో దేశ వైద్య రంగం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News April 16, 2026

కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

image

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

News April 16, 2026

10-20% పెరగనున్న మందుల ధరలు?

image

క్యాన్సర్ సహా ఇతర అత్యవసర మెడిసిన్ ధరలను 10-20% పెంచేందుకు ఫార్మా కంపెనీలకు కేంద్రం అనుమతిచ్చే అవకాశముందని నేషనల్ మీడియా పేర్కొంది. యుద్ధం నేపథ్యంలో ముడిపదార్థాల రవాణాలో అంతరాయం, ఖర్చులు పెరగడంతో ధరలు పెంచాలని కంపెనీలు కోరినట్లు తెలిపింది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు తాత్కాలికంగా 3 నెలలు వరకు మాత్రమే ఉంటుందని, పరిస్థితులు చక్కబడిన తర్వాత ధరలు తగ్గిస్తారని సమాచారం.

News April 16, 2026

రాబోయే 2 గంటల్లో వర్షం

image

TG: వచ్చే 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వర్షాల వల్ల ఉక్కపోత, వేడి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.