News December 15, 2024
భయంతో జీవిస్తున్నాం.. కాపాడండి: హీరో మనోజ్
TG: నిన్న రాత్రి తన కుటుంబంపై దాడికి ప్రయత్నం జరిగిందని మంచు మనోజ్ ఆరోపించారు. తల్లి బర్త్‌డే సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో తాను లేనప్పుడు విష్ణు, అనుచరులు, బౌన్సర్లు ఇంట్లోకి వచ్చారని తెలిపారు. <<14889405>>జనరేటర్లో <<>>పంచదార కలిపిన డీజిల్ పోసి పని చేయకుండా చేశారని ఆరోపించారు. రాత్రి విద్యుత్ అంతరాయంతో ఆందోళనకు గురయ్యామన్నారు. తన కుటుంబం నిరంతరం భయంతో జీవిస్తోందని, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
Similar News
News January 16, 2025
సెలవులు పొడిగించాలని వినతి
సంక్రాంతి సెలవుల తర్వాత తెలంగాణలో కాలేజీలు శుక్రవారం నుంచి, స్కూళ్లు శనివారం నుంచి పున:ప్రారంభం కానున్నాయి. అయితే తమ పిల్లలను ఆ రోజుల్లో పంపించబోమని, సోమవారం పంపుతామని కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. శనివారం కూడా హాలిడే ఇవ్వాలని కోరుతున్నారు. అటు ఏపీలో స్కూళ్లు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. మరి మీరెప్పుడు స్కూల్/కాలేజీకి వెళ్తున్నారో కామెంట్ చేయండి.
News January 16, 2025
అదానీని తిప్పలు పెట్టిన హిండెన్‌బర్గ్ షట్‌డౌన్
అదానీ గ్రూప్, సెబీ చీఫ్ మాధబిపై ఆరోపణలతో రిపోర్టులిచ్చిన హిండెన్‌బర్గ్ మూతపడనుంది. కంపెనీని శాశ్వతంగా షట్‌డౌన్ చేస్తున్నట్టు యజమాని నేట్ అండర్సన్ ప్రకటించారు. షార్ట్ సెల్లింగ్ చేశాక ఆ కంపెనీలపై నివేదికలిచ్చి ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచి, తర్వాత తక్కువ ధరకు షేర్లను కొని లాభపడటమే దాని పని. రీసెర్చ్ ఐడియాలన్నీ అయిపోయాయని, రెస్ట్ తీసుకుంటానంటున్న నేట్ సరిగ్గా ట్రంప్ రాకముందే షట్‌డౌన్ చేయడం గమనార్హం.
News January 16, 2025
అదరగొడుతున్న ప్రతికా రావల్
టీమ్ ఇండియా ఉమెన్స్ టీమ్ ఓపెనర్ ప్రతికా రావల్ ఐర్లాండ్ సిరీస్‌లో అదరగొట్టారు. ఆడిన మూడు మ్యాచుల్లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో 310 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు. గత ఏడాది డిసెంబర్లో WIతో జరిగిన వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఈ యంగ్ ప్లేయర్ తొలి మ్యాచులోనే 40 పరుగులు చేశారు. ఓవరాల్‌గా ఆరు మ్యాచుల్లో 74 సగటుతో 444 పరుగులు చేశారు. ఇందులో ఓ సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.