News April 17, 2024
వాలంటీర్ల వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు: లోకేశ్

AP: వాలంటీర్ల వేతనాలను రెట్టింపు చేస్తామని టీడీపీ నేత నారా లోకేశ్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 9 మంది వాలంటీర్లు టీడీపీలో చేరారని ఆయన తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వారి భవిష్యత్తుకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. కేవలం పెన్షన్లే కాకుండా ఇతర సంక్షేమ పథకాలు కూడా రాబోయే రోజుల్లో వాలంటీర్ల ద్వారా అందజేస్తామన్నారు లోకేశ్.
Similar News
News November 1, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్న

భారత ప్లేయర్ రోహన్ బోపన్న(45) ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికారు. ‘నా రాకెట్‌ను అధికారికంగా వదిలేస్తున్నా. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తా’ అని తెలిపారు. ఇటీవల ప్యారిస్ మాస్టర్స్1000 ఈవెంట్లో బోపన్న తన చివరి మ్యాచ్(డబుల్స్) ఆడారు. 22ఏళ్ల కెరీర్లో 2 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు ఓల్డెస్ట్ గ్రాండ్‌స్లామ్ విన్నర్‌గా, డబుల్స్‌లో ఓల్డెస్ట్ వరల్డ్ no.1గా చరిత్ర సృష్టించారు.
News November 1, 2025
ఈ ఏడాది జరిగిన తొక్కిసలాటలు ఇవే..

– JAN8: తిరుపతి- వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల క్యూ లైన్లో ఆరుగురి మృతి
– JAN29: UP కుంభమేళా- మౌని అమావాస్య స్నానాల్లో 30 మంది మృతి
– FEB 15: ఢిల్లీ రైల్వే స్టేషన్- రైల్వే అనౌన్స్మెంట్ గందరగోళంతో ప్లాట్‌ఫాం 14, 15పై 18 మంది మృతి
– JUNE4: బెంగళూరు- RCB విక్టరీ పరేడ్‌లో 11 మంది మృతి
– SEP27: కరూర్‌లో TVK చీఫ్ విజయ్ ర్యాలీలో 41 మంది మృతి
– NOV1: శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో 10 మంది మృతి
News November 1, 2025
ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలి: BJP MP

దేశ రాజధాని ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలన్న డిమాండ్లు క్రమేణా పెరుగుతున్నాయి. ఢిల్లీ BJP MP ప్రవీణ్ ఖండేల్వాల్ హోమ్ మంత్రి అమిత్ షాకు, ఢిల్లీ CM, మంత్రులకు లేఖ రాశారు. ఇంద్రప్రస్థగా పేరుమార్చి దేశ చారిత్రక, సాంస్కృతిక, నాగరికత మూలాలను ప్రతిబింబింప చేయాలని పేర్కొన్నారు. కాగా ఇంతకు ముందు VHP కూడా ఢిల్లీ పేరు మార్పుపై కేంద్రానికి లేఖ రాసింది. ఎంపీ లేఖతో ఈ డిమాండ్‌కు మరింత మద్దతు వస్తోంది.


