News June 29, 2024
మేం అదానీకి ఆస్తులు రాసివ్వడం లేదు: CM
TG: పాతబస్తీలో విద్యుత్తు పంపిణీ, బిల్లుల వసూలు బాధ్యతను ప్రభుత్వం అదానీ కంపెనీకి అప్పగించింది. దీంతో విద్యుత్తు వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తూ అదానీకి కట్టబెట్టడమేనన్న ఆరోపణలపై CM రేవంత్ స్పందించారు. ‘మేం మోదీలా ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను అదానీకి రాసివ్వడంలేదు. అదానీని విద్యుత్తురంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నాం అంతే. రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టినా ఆహ్వానిస్తాం’ అని వివరించారు.
Similar News
News December 10, 2024
BREAKING: మోహన్ బాబుకు పోలీసుల నోటీసులు
TG: <<14843588>>మీడియాపై దాడి<<>> నేపథ్యంలో సీనియర్ నటుడు మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు విష్ణు, మనోజ్‌కు నోటీసులిచ్చారు. వీరిని రేపు ఉదయం 10.30 గంటలకు CP కార్యాలయానికి హాజరు కావాలన్నారు. కాగా మోహన్ బాబు గన్‌ను పోలీసులు సరెండర్ చేసుకున్నారు. మరోవైపు అస్వస్థతకు గురైన మోహన్ బాబు ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News December 10, 2024
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం ట్వీట్
TG: డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘4 కోట్ల ప్రజల మనోఫలకాలపై నిండైన రూపంగా నిన్నటి వరకు నిలిచిన తెలంగాణ తల్లి నేడు సచివాలయ నడిబొడ్డున నిజమైన రూపంగా అవతరించిన శుభ సందర్భం. ఇది తల్లి రుణం తీసుకున్న తరుణం’ అని Xలో రాసుకొచ్చారు.
News December 10, 2024
జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి.. ఆరా తీసిన మంత్రి
TG: మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరా తీశారు. జర్నలిస్టు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. మరోవైపు మోహన్ బాబు దాడిని ఖండిస్తున్నట్లు ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని, లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.