News January 31, 2025
KCR గర్జనలు గమనిస్తున్నాం: పొంగులేటి

TG: KCR గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆయన ఫామ్‌హౌస్ నుంచే మాట్లాడతారా.. అసెంబ్లీకి కూడా వస్తారా? అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత ప్రజల్లో తిరిగి వారి సమస్యలు ప్రస్తావించాలన్నారు. వరదలొచ్చినప్పుడు ప్రజలను కనీసం పరామర్శించలేదని మంత్రి విమర్శించారు. ఇన్ని రోజులు ఫామ్‌హౌస్‌లో ఉన్న KCR పంచాయతీ ఎన్నికల కోసమే బయటకు వస్తానంటున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు.
Similar News
News February 16, 2025
వల్లభనేని వంశీ అంటేనే అరాచకం : మంత్రి నిమ్మల

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ అంటేనే అరాచకత్వం అవినీతికి మారుపేరని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వంశీని సమర్థిస్తున్న జగన్ కూడా ఒక అరాచక శక్తి అని మండిపడ్డారు. ‘దేశంలో ఎక్కడా ఏ పార్టీ ఆఫీస్‌లపై దాడి జరగలేదు. కానీ టీడీపీ ఆఫీస్‌పై వంశీ దాడి చేశాడు. దీనిపై ఫిర్యాదు చేసిన దళితుడిని కిడ్నాప్ చేసిన ఘనుడు. 11 సీట్లు ఇచ్చినా వైసీపీ నేతలు, జగన్‌కు ఇంకా బుద్ధి రాలేదు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 16, 2025
న్యాయమూర్తులను ఏరేస్తున్న ట్రంప్

ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా 20మంది ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను తొలగించారు. దీంతో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పలువురు కోర్టులలో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్ ‘తన దేశాన్ని కాపాడుకొనే వ్యక్తి ఎన్నటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు’ అనే ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
News February 16, 2025
రాహుల్ గాంధీది బ్రాహ్మణ కుటుంబం: జగ్గారెడ్డి

TG: రాహుల్ గాంధీ కులంపై ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బదులిచ్చారు. రాహుల్‌ది బ్రాహ్మణ కుటుంబమని, వారు హిందువులని పేర్కొన్నారు. సోనియాను ఉద్దేశించి హిందూ ధర్మం ప్రకారం భర్త మతమే భార్యకు వస్తుందని చెప్పారు. బీజేపీ నేతలు చేసే విమర్శల్లో కొన్నయినా వాస్తవాలు ఉండాలని హితవు పలికారు. నెహ్రూ కుటుంబం కులమతాలకు అతీతంగా పని చేసిందని తెలిపారు.