News July 20, 2024
ప్రతినెలా రూ.5వేల కోట్ల వడ్డీ కడుతున్నాం: జూపల్లి
TG: గత పదేళ్లుగా బీఆర్ఎస్ చేయలేని పనిని తాము చేసి చూపించామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతన్నలు పంటలు వేసే సరైన సమయంలో రుణాలు మాఫీ చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ పాలించిన పదేళ్లలో రూ.7లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. ఆయన చేసిన అప్పులకే తమ ప్రభుత్వం నెలకు రూ.5వేల కోట్ల వడ్డీ కడుతోందని రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు.
Similar News
News December 12, 2024
నేడు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సెలవు
AP: భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎవరైనా తరగతులు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా తిరుపతిలో ఇవాళ భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
News December 12, 2024
కాసేపట్లో అవంతి ప్రెస్‌మీట్.. కీలక ప్రకటన చేసే అవకాశం!
AP: మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కాసేపట్లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. కొంతకాలంగా ఆయన YCP కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రెస్‌మీట్‌లో అవంతి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
News December 12, 2024
తీవ్ర విషాదం.. 55 గంటలు కష్టపడినా!
రాజస్థాన్ దౌసాలో విషాదం నెలకొంది. ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన ఐదేళ్ల చిన్నారి మృతిచెందాడు. 55 గంటల పాటు పొక్లెయిన్లతో బాలుడిని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది పడిన శ్రమ వృథా అయింది. చిన్నారిని వెలికితీసి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు. బాలుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. గాయాలు, ఆక్సిజన్ కొరత వల్ల బాలుడు మృతి చెందాడని చెప్పారు.