News April 5, 2024

ఇంటి అద్దె కట్టలేక బాధపడ్డాం: రష్మిక

image

తన బాల్యంలో ఆర్థిక కష్టాల కారణంగా ఇంటి అద్దె కట్టలేకపోయామని నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలిపారు. ‘నా చిన్నప్పుడు సొంత ఇల్లు లేదు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇల్లు మారేవాళ్లం. అద్దె కట్టలేక రోడ్డున పడ్డ సందర్భాలు ఉన్నాయి. నా తల్లిదండ్రులు నేను ఆడుకోవడానికి బొమ్మను కూడా కొనలేకపోయారు. అందుకే ఇప్పుడు నేను డబ్బుకు విలువిస్తాను. సక్సెస్‌ను అంత ఈజీగా తీసుకోను’ అని ఆమె చెప్పారు.

Similar News

News January 17, 2025

3.5 కోట్ల పని దినాలు కల్పించండి.. కేంద్రానికి లేఖ

image

AP: ఉపాధి హామీ పని దినాలు పూర్తి కావొస్తుండటంతో అదనంగా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్రం 21.50 కోట్ల పనిదినాలు కేటాయించగా 20.45 కోట్ల పని దినాలు పూర్తి చేశారు. దీంతో మరో 3.5 కోట్ల పనిదినాలు కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

News January 17, 2025

సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీలు

image

TG: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు నిన్నటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. దీంతో నేటి నుంచి కాలేజీ విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు. మరోవైపు స్కూళ్లకు సెలవులు నేటితో ముగియనుండటంతో రేపు పాఠశాలలన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. ఆదివారం వరకు సెలవులు పొడిగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అటు ఏపీలో స్కూళ్లు 20న పునః ప్రారంభం కానున్నాయి.

News January 17, 2025

అతడి వల్లే భారత్ ఓడిపోయింది: అశ్విన్

image

BGTలో టీమ్ ఇండియా ఓడిపోవడానికి ఆస్ట్రేలియా బౌలర్ బోలాండే కారణమని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ‘కమిన్స్ అద్భుతంగా రాణించారని అందరూ అంటున్నారు. కానీ అతడు లెఫ్ట్ హ్యాండర్లకు బౌలింగ్ వేసేటప్పుడు ఇబ్బంది పడ్డారు. బోలాండ్ టీంలోకి రావడం ఆస్ట్రేలియా అదృష్టం. అతడు లేకుంటే భారత్ గెలిచేది’ అని చెప్పారు. కాగా హేజిల్‌వుడ్‌కు గాయం కావడంతో బోలాండ్ టీంలోకి వచ్చి 3 టెస్టుల్లో 21 వికెట్లు తీశారు.