News August 30, 2024

మేం అండర్ డాగ్స్: కమలా హ్యారిస్

image

తాము అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగుతున్నామని డెమోక్రాట్స్ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ అంటున్నారు. ప్రస్తుత ఎన్నికల పోరాటం అమెరికా భవిష్యత్తు కోసం జరుగుతోందని పేర్కొన్నారు. తమ గెలుపును దేశం విశ్వసిస్తోందన్నారు. ‘మరో 68 రోజులే. నిజం మాట్లాడేందుకే నేనిక్కడికి వచ్చాను. మా ముందు చాలా కష్టమైన పనుంది. మాకదే ఇష్టం. హార్డ్ వర్క్ అంటేనే గుడ్ వర్క్. మీ సహకారంతో మేం నవంబర్లో విజయం సాధిస్తాం’ అని అన్నారు.

Similar News

News September 15, 2024

రేపు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ

image

TG: రేపు మధ్యాహ్నం 3.45 గంటలకు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పాల్గొంటారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాగా కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక రావట్లేదని సమాచారం.

News September 15, 2024

అట్లీ-అల్లు అర్జున్ కాంబో.. బిగ్ అప్డేట్?

image

అల్లు అర్జున్, అట్లి కాంబినేషన్‌లో మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ నిర్మించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. గీతా ఆర్ట్స్‌తో సంయుక్తంగా సినిమాను తెరకెక్కించే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ డిసెంబర్ 6న విడుదల కానుంది.

News September 15, 2024

SEP 17ని విమోచన దినోత్సవంగా నిర్వహించండి: బండి

image

TG: సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. కేంద్రం కూడా అదే పేరుతో నిర్వహిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారి చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అప్పటి రజాకర్లే దళమే..ప్రస్తుతం MIM పార్టీగా అవతరించిందన్నారు.