News June 21, 2024
పేపర్ లీక్ ఛానళ్లను బ్లాక్ చేశాం: టెలిగ్రామ్
UGC NET ప్రశ్నపత్రాల లీక్‌కు పాల్పడిన ఛానళ్లను బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ ప్రకటించింది. ఈ కేసులో లా అండ్ ఆర్డర్‌కు కట్టుబడి, అధికారుల దర్యాప్తునకు సహకరిస్తామని పేర్కొంది. తమ హెల్ప్‌డెస్క్‌కు ఏ ఫిర్యాదు వచ్చినా చట్టాన్ని అనుసరిస్తూ చర్యలు తీసుకుంటూ వస్తున్నామని తెలిపింది. టెలిగ్రామ్ ద్వారానే పేపర్ లీకైందని వస్తున్న వార్తలపై ఆ సంస్థ ఇలా స్పందించింది.
Similar News
News September 20, 2024
ఉప్పరపల్లి కోర్టుకు జానీ
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. రాజేంద్రనగర్ సీసీఎస్ నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి జానీని పోలీసులు విచారించారు.
News September 20, 2024
CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
చార్టెర్డ్ అకౌంటెన్సీ (CA)-2024 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 12, 14, 16, 18 తేదీల్లో ఫౌండేషన్ కోర్స్ ఎగ్జామ్స్ ఉంటాయని ICAI ప్రకటించింది. జనవరి 11, 13, 15 తేదీల్లో ఇంటర్మీడియట్ కోర్స్ గ్రూప్-1, జనవరి 17, 19, 21 తేదీల్లో ఇంటర్మీడియట్ కోర్స్ గ్రూప్-2 పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఫౌండేషన్, ఇంటర్మీడియట్ కోర్సుల పరీక్షలు మ.2 గంటల నుంచి ప్రారంభం అవుతాయని వివరించింది.
News September 20, 2024
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్‌గా రాథోడ్
ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ టీమ్ బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్‌ను నియమించింది. ఆయన ఇటీవల భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పని చేశారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ ఇప్పటికే ప్రధాన కోచ్ బాధ్యతలు రాహుల్ ద్రవిడ్‌కు అప్పగించింది. తాజాగా రాథోడ్‌ను సైతం నియమించుకుంది. భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంలో వీరిద్దరూ తెర వెనుక కీలకపాత్ర పోషించారు.