News December 18, 2024
అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: విజయ్ దళపతి
అంబేడ్కర్‌పై అమిత్ షా <<14912480>>వ్యాఖ్యలను<<>> తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ దళపతి ఖండించారు. ‘కొందరికి అంబేడ్కర్ పేరంటే నచ్చకపోవచ్చు. కానీ ప్రస్తుతం స్వాతంత్ర్య స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న ప్రతి భారతీయుడు ఆరాధించే వ్యక్తి ఆయన. అంబేడ్కర్ పేరు పలకడానికి గుండె, పెదవులు కూడా ఎంతో సంతోషిస్తాయి. ఆయనను అగౌరవపరచడాన్ని అంగీకరించం. మా పార్టీ తరఫున కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 13, 2025
Thank You పవన్ కళ్యాణ్: YCP
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వైసీపీ థాంక్స్ చెప్పింది. జగన్ హయాంలో చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేస్తూ ఆయన తమకు స్టార్ క్యాంపెయినర్‌గా మారారని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. స్కూళ్లు, కర్నూలులో గ్రీన్‌కో సోలార్ ప్రాజెక్టు, పంప్ స్టోరేజ్, విశాఖలో రుషికొండ భవనాల వద్ద ఆయన ఫొటోలను షేర్ చేసింది. కాగా తమ ప్రభుత్వంలో పూర్తిచేసిన కార్యక్రమాలపై వైసీపీ ఇవాళ్టి నుంచి క్యాంపెయిన్ ప్రారంభించింది.
News January 13, 2025
మరోసారి తగ్గనున్న మద్యం ధరలు!
APలో మద్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. లిక్కర్ బ్రాండ్లలో ధరల తగ్గింపునకు కంపెనీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే మాన్షన్ హౌస్, అరిస్ట్రోకాట్ ప్రీమియం, కింగ్ ఫిషర్ వంటివి ధరలు తగ్గించుకోగా, బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ధరల తగ్గింపునకు ప్రభుత్వానికి అప్లై చేసుకుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
News January 13, 2025
రేషన్ కార్డులకు రికమెండేషన్స్ అవసరం లేదు: మంత్రి
TG: రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్డుల జారీకి ఎలాంటి రికమెండేషన్స్ అవసరం లేదని, అర్హులైన వారందరికీ ఇస్తామని చెప్పారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారిలో ఎవరైనా అనర్హులుంటే గ్రామ సభల్లో చెప్పాలని అన్నారు. వారి అప్లికేషన్లను పక్కనపెడతామని పేర్కొన్నారు.