News May 20, 2024
నాలుగు దశల్లోనే 270 సీట్లు దాటేశాం: అమిత్ షా
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ముగిసిన నాలుగు దశల పోలింగ్‌లోనే ప్రధాని మోదీ 270 సీట్లను అధిగమించారని అన్నారు. కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని అవమానించారని దుయ్యబట్టారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ని స్వాధీనం చేసుకుంటామని పునరుద్ఘాటించారు.
Similar News
News December 5, 2024
100 పరుగులకే భారత్ ఆలౌట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత మహిళల జట్టు 34.2 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్ మెగన్ 5 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించారు. టీమ్ ఇండియా బ్యాటర్లలో రోడ్రిగ్స్(23)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆస్ట్రేలియా టార్గెట్ 101.
News December 5, 2024
నెట్‌ఫ్లిక్స్‌కు పుష్ప-2 OTT రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్-రష్మిక జంటగా నటించిన పుష్ప-2 సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం దాదాపు రూ.250 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో సంక్రాంతి తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వీలైనన్ని ఎక్కువ రోజులు థియేట్రికల్ రన్ కొనసాగిస్తామని మూవీ వర్గాలు చెబుతున్నాయి.
News December 5, 2024
KTR, హరీశ్‌ది చిన్నపిల్లల మనస్తత్వం: రేవంత్
TG: పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని BRS, ఏడాదిలో ఇన్ని పథకాలు అమలు చేస్తున్న తమను విమర్శించడం ఏంటని CM రేవంత్ అన్నారు. ‘తొలి ఏడాదిలో 5నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల సచివాలయానికి వెళ్లలేకపోయాం. మిగిలిన 6నెలల్లో పరిపాలనను గాడిలో పెట్టాం. KTR, హరీశ్‌ది చిన్నపిల్లల మనస్తత్వం. మనదగ్గర లేని బొమ్మ పక్కోడి దగ్గర ఉంటే విరగ్గొట్టాలనే ఆలోచన ఉంటుంది. వారికి తెలియదేమో కానీ KCRకి కూడా అవగాహన లేదా?’ అని ప్రశ్నించారు.