News May 24, 2024
కోచ్ కోసం మేం వారిని సంప్రదించలేదు: జై షా

టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవి కోసం తాము ఏ ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లను సంప్రదించలేదని BCCI సెక్రటరీ జై షా తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని స్పష్టం చేశారు. సరైన కోచ్ కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. భారత జట్టును మరో లెవెల్‌కు చేర్చే కోచ్‌ను నియమిస్తామని చెప్పారు. కాగా భారత హెడ్ కోచ్ పదవిని పాంటింగ్, లాంగర్, ఆండీ ఫ్లవర్ తదితరులు తిరస్కరించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News November 21, 2025
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు

HYDలోని అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు GHMC నోటీసులు ఇచ్చింది. ఈ సంస్థలు తాము వినియోగిస్తున్న స్థలాన్ని తక్కువగా చూపుతూ ట్రేడ్ లైసెన్స్ పొందినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులిచ్చారు. అన్నపూర్ణ సంస్థ ₹11.52L చెల్లించాల్సి ఉండగా కేవలం ₹49K చెల్లిస్తోందని, రామానాయుడు సంస్థ ₹2.73Lకి గాను ₹7,614 కడుతున్నట్లు సమాచారం.
News November 21, 2025
OTTలోకి వచ్చేసిన ‘బైసన్’

చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన ‘బైసన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మారి సెల్వరాజ్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో అనుపమ, పశుపతి కీలక పాత్రలు పోషించారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ధ్రువ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
News November 21, 2025
హ్యాపీగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినండి

మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్ అయిన డోపమైన్ ఆహారంలోనూ దొరుకుతుందంటున్నారు నిపుణులు. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. బెర్రీస్, అరటిపండ్లు, నట్స్, ఫ్యాటీ ఫిష్, ప్రోబయాటిక్స్, ఓట్స్, ఆకుకూరలు, గుడ్లు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటి వల్ల మూడ్ బాగుండటమే కాకుండా మెంటల్ క్లారిటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గించి ఎమోషనల్ హెల్త్ బావుండేలా చూస్తాయంటున్నారు నిపుణులు.


