News August 5, 2024

వ్యవస్థలను బతికించాలనే అవమానాలు తట్టుకున్నాం: పవన్

image

ఏపీ ఒకప్పుడు మోడల్ స్టేట్‌గా ఉండేదని, గత ఐదేళ్లలో ఎలా ఉండకూడదనే దానికి నిదర్శనంగా నిలిచిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చింది. అందరం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. వ్యవస్థలను బతికించాలనే అన్నీ తట్టుకుని నిలబడ్డాం. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలి’ అని పిలుపునిచ్చారు.

Similar News

News May 8, 2025

శ్రేయస్ ఖాతాలో అరుదైన రికార్డు

image

ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. కనీసం 50 మ్యాచుల్లో నాయకత్వం వహించి అత్యధిక విజయశాతం కలిగిఉన్న కెప్టెన్‌గా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ విజయశాతం 59.4% ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్(58.9%), సచిన్(58.8%), ధోనీ(58.4) ఉన్నారు.

News May 8, 2025

లాలూ విచారణకు రాష్ట్రపతి అనుమతి

image

‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో మాజీ రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఈడీ విచారణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతించారు. రైల్వే ఉద్యోగుల కుంభకోణంలో లాలూతో పాటు అతని కుటుంబ సభ్యుల విచారణకు పర్మిషన్ ఇవ్వాలని 2022లో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. తాజాగా రాష్ట్రపతి నుంచి అనుమతి లభించింది. కాగా లాలూ రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్-D ఉద్యోగాలకు భూమిని లంచంగా తీసుకున్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది.

News May 8, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్

image

ధర్మశాల వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ ఆశలను మరింత మెరుగుపరుచుకోనుంది.
DC: డుప్లెసిస్, పోరెల్, KL రాహుల్, సమీర్ రిజ్వీ, అక్షర్, స్టబ్స్, మాధవ్ తివారీ, స్టార్క్, చమీరా, కుల్దీప్, నటరాజన్
PBKS: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాంశ్, ఇంగ్లిస్, శ్రేయస్, వధేరా, శశాంక్, స్టొయినిస్, జాన్సెన్, అజ్మతుల్లా, చాహల్