News February 6, 2025

ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదు: కల్కి నిర్మాణ సంస్థ

image

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు పాల్పడి అరెస్టయ్యారని జరుగుతున్న ప్రచారంపై ‘కల్కి’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ స్పందించింది. నీలేశ్ చోప్రా అనే వ్యక్తి తమ ఆఫీసులో పనిచేయలేదని, ఏ విధంగానూ అతనితో సంస్థకు సంబంధాలు లేవని Xలో పేర్కొంది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసినట్లు వెల్లడించింది. ఏదైనా సమాచారాన్ని పబ్లిష్ చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించింది.

Similar News

News December 2, 2025

రూపాయి నేల చూపు.. మరింత కనిష్ఠ స్థాయికి!

image

రూపాయి నేలచూపులు చూస్తోంది. వరుసగా ఐదో సెషన్‌లోనూ క్షీణించి ఇవాళ రికార్డు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే 89.874 వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది. అంతకుముందు All time low 89.895ను తాకి 90కి చేరువైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 4 శాతం వరకు రూపాయి పడిపోయింది. అమెరికా డాలర్ బలపడటం, ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఆలస్యమవడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

News December 2, 2025

ESIC అంకలేశ్వర్‌లో ఉద్యోగాలు

image

<>ESIC<<>> హాస్పిటల్, అంకలేశ్వర్‌ 16 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 11న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, పీజీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పార్ట్ టైమ్ స్పెషలిస్ట్‌కు నెలకు రూ.60,000, ఫుల్‌టైమ్ స్పెషలిస్ట్‌కు రూ.1,35,129 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in