News February 6, 2025
ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదు: కల్కి నిర్మాణ సంస్థ

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు పాల్పడి అరెస్టయ్యారని జరుగుతున్న ప్రచారంపై ‘కల్కి’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ స్పందించింది. నీలేశ్ చోప్రా అనే వ్యక్తి తమ ఆఫీసులో పనిచేయలేదని, ఏ విధంగానూ అతనితో సంస్థకు సంబంధాలు లేవని Xలో పేర్కొంది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసినట్లు వెల్లడించింది. ఏదైనా సమాచారాన్ని పబ్లిష్ చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించింది.
Similar News
News March 25, 2025
ఏటీఎం ఛార్జీల పెరుగుదల.. ఎప్పటినుంచంటే..

ఈ ఏడాది మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు పెరగనుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో 5సార్లు, నాన్ మెట్రో ప్రాంతాల్లో 3సార్లు ప్రతి నెలా ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. మే 1 నుంచి ఆ పరిధి దాటితే డబ్బు విత్‌డ్రాకు ఇప్పుడున్న రూ.17 నుంచి రూ.19కి, బాలెన్స్ చెకింగ్‌కు ఇప్పుడున్న రూ.6 నుంచి రూ.7కి ఛార్జీలు పెరగనున్నాయి.
News March 25, 2025
జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌దే: భారత ప్రతినిధి

జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని భారత శాశ్వత ప్రతినిధి తేల్చిచెప్పారు. పాకిస్థాన్ ఆక్రమించుకున్న ప్రాంతాలను భారత్‌కు వెంటనే అప్పగించాలని స్పష్టం చేశారు. UNOలో పాక్ అనవసరంగా జమ్మూకశ్మీర్ ప్రస్తావన తీసుకొస్తోందని, ఎన్ని అవాస్తవాలు చెప్పినా ఆ ప్రాంతం భారత్‌కే చెందుతుందని అన్నారు. UNO శాంతి పరిరక్షణ చర్చలో జమ్మూకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ ప్రతినిధి లేవనెత్తగా భారత్ దీటుగా బదులిచ్చింది.
News March 25, 2025
‘ఆస్కార్’ గెలుపొందిన దర్శకుడిపై దాడి

‘ఆస్కార్’ గ్రహీత, పాలస్తీనా దర్శకుడు హందాన్ బల్లాల్‌పై వెస్ట్ బ్యాంక్‌లో దాడి జరిగింది. తొలుత సెటిలర్లు దాడి చేయగా ఆ తర్వాత ఇజ్రాయెల్ బలగాలు అతడిని అరెస్ట్ చేశాయి. హందాన్‌కు తల, కడుపుపై గాయాలయ్యాయని సన్నిహితులు తెలిపారు. అయితే అతడి అరెస్టుపై ఇజ్రాయెల్ బలగాలు ఎటువంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. ‘నో అదర్ ల్యాండ్’ పేరిట పాలస్తీనాపై హందాన్, అతడి టీమ్ రూపొందించిన డాక్యుమెంటరీకి ఆస్కార్ లభించింది.