News June 2, 2024
సర్వజ్ఞానులం అనే భ్రమలు మాకు లేవు: రేవంత్
TG: తమ పాలనలో తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘సర్వజ్ఞానులం అనే భ్రమలు మాకు లేవు. అందరి సలహాలు స్వీకరించి, చర్చించి ముందుకెళ్తాం. ప్రతిపక్షాలకు గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాలు, లోటుపాట్ల సమీక్షకు అవకాశమిస్తున్నాం. పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది. ప్రజల సంపద గుప్పెడు మంది చేతుల్లోకి వెళ్లింది’ అని రేవంత్ వివరించారు.
Similar News
News September 13, 2024
20న ఓటీటీలోకి ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’
రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మారుతీనగర్ సుబ్రమణ్యం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ నెల 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మధ్యతరగతికి చెందిన ఓ నిరుద్యోగి కష్టాల చుట్టూ సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఇంద్రజ, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు.
News September 13, 2024
హైజాక్ ఫ్లైట్‌లో నా తండ్రీ ఉన్నారు: జైశంకర్
1984 విమాన హైజాక్ ఘటనపై ‘IC-814’ మూవీ వచ్చిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘హైజాకర్లతో సంప్రదింపులు జరిపిన బృందంలో నేనూ సభ్యుడిని. కొన్నిగంటల తర్వాత విమానంలో నా తండ్రి కూడా ఉన్నారని తెలిసింది. అది నాకు చాలా భిన్నమైన అనుభవం. ఓవైపు ప్రభుత్వం తరఫున జవాబుదారీతనం, మరోవైపు గవర్నమెంట్‌పై ఒత్తిడి తెచ్చిన బాధిత కుటుంబంలో సభ్యుడిగా ఉండాల్సి వచ్చింది’ అని తెలిపారు.
News September 13, 2024
వ్యాపారవేత్తకు అన్నామలై క్షమాపణలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తమిళనాడు శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ ఓనర్ శ్రీనివాసన్ క్షమాపణలు చెబుతున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తిగతమైన వీడియో బయటికి వెళ్లడం బాధాకరమని పేర్కొన్నారు. శ్రీనివాసన్‌కు ఫోన్ చేసి మాట్లాడానని, తమిళనాడు వ్యాపార వర్గాల్లో ఆయన ఓ దిగ్గజమని ఈ సందర్భంగా అన్నామలై కొనియాడారు.