News January 27, 2025

నవశకానికి నాంది పలికాం: సీఎం రేవంత్

image

TG: ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించి నవశకానికి నాంది పలికామని CM రేవంత్ ట్వీట్ చేశారు. ‘రైతును రాజును చేసే ‘రైతుభరోసా’, కూలీకి చేయూతనిచ్చే ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’, పేదల సొంతింటి కల సాకారం చేసే ‘ఇందిరమ్మ ఇళ్లు’, అన్నార్తుల ఆకలి తీర్చే ‘కొత్త రేషన్ కార్డులు’ వంటి పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాం. ఈ సరికొత్త అధ్యాయాన్ని నా సొంత నియోజకవర్గంలో ప్రారంభించాను’ అని పేర్కొన్నారు.

Similar News

News November 23, 2025

ఆహా.. ఓహో! అంతా అరచేతిలో స్వర్గమేనా?

image

AP: ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్స్ అంటే పోటీ ప్రకటనలు, ప్రదర్శనల వేదికలుగా మారుతున్నాయా? జగన్ CMగా ఉండగా 340 కంపెనీలు ₹13 లక్షల కోట్ల పెట్టుబడికి ఆసక్తి చూపాయని నాటి ప్రభుత్వం చెప్పింది. ఇక 16 లక్షల ఉద్యోగాలు వచ్చేలా 625 కంపెనీలు ₹13.25 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌కు ఇంట్రస్ట్ చూపాయని CBN తాజా ప్రభుత్వ స్టేట్మెంట్. వాస్తవ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలు ప్రకటనలకు దగ్గరగా ఉన్నాయా? అంటే ఆన్సర్ మీకు తెలుసుగా!

News November 23, 2025

రూ.485కే 72 రోజుల ప్లాన్

image

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా 72 రోజుల స్మార్ట్ సేవింగ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.485తో రీఛార్జ్ చేస్తే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 2GB డేటా, 100 SMSలను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇదే తరహా ప్లాన్లు మిగతా టెలికాం కంపెనీల్లో దాదాపు రూ.700-800 రేంజ్‌లో ఉన్నాయి.

News November 23, 2025

TG న్యూస్ అప్డేట్స్

image

* ఫార్ములా-ఈ కార్ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం. ఈ భయంతోనే ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రూ.5 లక్షల కోట్ల భూస్కామ్ అంటున్న కేటీఆర్ అందుకు ఆధారాలుంటే బయటపెట్టాలి: మంత్రి అడ్లూరి
* డీసీసీ పదవుల నియామకంలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. 17 పదవులను బీసీలకే ఇచ్చాం. కాంగ్రెస్ చేపట్టిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దేశ చరిత్రలో నిలిచిపోతుంది: మహేశ్ కుమార్ గౌడ్