News February 26, 2025

ఎలాంటి యుద్ధమైనా చేసే కొత్త ఆర్మీ కావాలి: కిమ్

image

అన్ని రకాల యుద్ధాలు చేయగల ఆధునిక, బలమైన ఆర్మీని నిర్మించాల్సి ఉందని నార్త్ కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అన్నారు. మిలిటరీ అకాడమీ, పొలిటికల్ కాలేజీని సందర్శించాక మాట్లాడారు. ‘ఐడియాలజీ లేని ఆయుధాలు జస్ట్ ఇనుప రాడ్లతో సమానం. ఇప్పుడు అధునాతన వ్యవస్థలు అవసరం. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు మారిపోయాయి. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఇంపీరియలిస్టులు దూకుడుగా యుద్ధాలకు పిలుపునిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News March 26, 2025

ప్రజలకు ప్రభుత్వం ‘ఉగాది కానుక’

image

TG: రేషన్‌కార్డు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండగ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హుజూర్‌నగర్‌లో లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తారు. దీనివల్ల 2.82 కోట్ల మంది ప్రయోజనం చేకూరనుంది. రేషన్ షాపుల్లో ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.

News March 26, 2025

సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ మరోసారి సంచలన కామెంట్స్

image

TG: BRS హయాంలో తనపై PD యాక్ట్ పెట్టినప్పుడు కొందరు BJP నేతలే జైలుకు పంపాలని పోలీసులకు చెప్పారని BJP MLA రాజాసింగ్ ఆరోపించారు. ఇప్పుడూ కొందరు ఎలా వెన్నుపోటు పొడవాలో ఆలోచిస్తున్నారని వాపోయారు. ఇక తాము అధికారంలోకి వస్తే పోలీసులపై చర్యలుంటాయన్న KTR కామెంట్స్‌పై స్పందించారు. అప్పట్లో KTR ఆదేశాలతో రేవంత్‌ను బెడ్రూమ్‌లోకి వెళ్లి అరెస్ట్ చేశారని ఇప్పుడాయన CM అయినా వారిని ఏం చేయలేకపోతున్నట్లు చెప్పారు.

News March 26, 2025

బాలీవుడ్‌లో సెటిల్ అవుతారా? శ్రీలీల సమాధానమిదే

image

తాను బాలీవుడ్‌లో సెటిల్ అవుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని హీరోయిన్ శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. టాలీవుడ్ తనకు ఇల్లు లాంటిదని పేర్కొన్నారు. మెడిసిన్ ఫైనలియర్ చదివేందుకు కొన్ని సినిమాలు వదులుకున్నట్లు వెల్లడించారు. నితిన్‌తో కలిసి ఆమె నటించిన ‘రాబిన్‌హుడ్’ ఎల్లుండి రిలీజ్ రానుంది. కాగా బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!