News August 6, 2024
వాళ్లనే స్థానికులుగా గుర్తిస్తాం: మంత్రి దామోదర
TG: MBBS ప్రవేశాల్లో స్థానికతపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై విమర్శలు రావడంతో మంత్రి దామోదర స్పందించారు. 9వ తరగతి నుంచి 12 వరకు రాష్ట్రంలో చదివిన విద్యార్థులను గత ప్రభుత్వ GO ఆధారంగా స్థానికులుగా కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 6 నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట 4 ఏళ్లు చదివిన వారికి స్థానికత కల్పించే నిబంధన వర్తించదని ఆయన స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీతో దీనికి సంబంధించిన గడువు ముగిసిందన్నారు.
Similar News
News September 10, 2024
16 ఏళ్లు నిండనివారు సోషల్‌మీడియా వాడొద్దన్న AUS ప్రభుత్వం!
సోషల్‌మీడియా వినియోగం పిల్లలను తప్పుదారి పట్టిస్తోందని భావించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం 16 ఏళ్లు నిండనివారు సోషల్‌మీడియా వినియోగించకుండా నిషేధం విధించనుంది. మొబైల్‌కే పరిమితం కాకుండా పిల్లలు మైదానంలోకి వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పీఎం వెల్లడించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా, టిక్‌టాక్ తదితర యాప్స్‌ను పిల్లలు వాడకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
News September 10, 2024
గ్లోబల్ స్టేజ్‌పై భారత్‌ను విస్మరించలేరు: కాంగ్రెస్ ఎంపీ
ప్రపంచ ఆర్థిక, రాజకీయాల్లో అత్యంత కీలకమైన భారత్‌ను విస్మరించరాదని, అలాగే తక్కువ అంచనా వేయలేరని కాంగ్రెస్ MP శశి థరూర్ స్పష్టం చేశారు. ‘వేగంగా పెరుగుతున్న జనాభా, ఎకానమీ అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ను అత్యంత కీలకంగా మార్చేశాయి. జియో పాలిటిక్స్‌లో చైనా, పాక్, USతో సవాళ్లు ఎదురవుతున్నా సమతూకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం భారత్ తీసుకొనే నిర్ణయాలు ప్రపంచంపై సుదీర్ఘకాలం ప్రభావం చూపిస్తాయి’ అని అన్నారు.
News September 10, 2024
నేను ప్రతిపక్షంలోనే ఉన్నా: MLA గాంధీ
TG: తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని శేరిలింగంపల్లి MLA అరికెపుడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానింకా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని వెల్లడించారు. తనకు CM రేవంత్ కప్పింది కాంగ్రెస్ కండువా కాదని, ఆలయానికి సంబంధించిన శాలువా అని చెప్పారు. గాంధీ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారని వార్తలు వినిపించాయి. ఆయనకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడంపై BRS అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇలా స్పందించారు.