News January 25, 2025
మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి: CBN

AP: థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనేది తమ నినాదమని CM CBN తెలిపారు. ‘ప్రపంచంలోని గొప్ప కంపెనీలన్నీ దావోస్కు వస్తుంటాయి. అక్కడికి వెళ్లడం వల్ల ప్రతినిధులను కలిసే అవకాశం వస్తుంది. మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి. సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తయారుచేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లు గొప్పస్థాయిలో ఉన్నారు. ధ్వంసమైన AP బ్రాండ్ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం’ అని అన్నారు.
Similar News
News November 12, 2025
SBIలో మేనేజర్ పోస్టులు

<
News November 12, 2025
వేగం వద్దు.. ఇలా కూడా ఆనందపడవచ్చు!

బైక్, కార్లలో వేగంగా ప్రయాణించడం ద్వారా పొందే తాత్కాలిక సంతోషం కంటే, దైవ స్మరణలో నిమగ్నమై ఆ దైవత్వం గొప్పతనాన్ని తెలుసుకుంటే మనిషికి అంతకన్నా ఉన్నత స్థాయి ఉండదు. జీవితంలో నిజమైన ఆనందం ఆ వేగంలో లేదు. పరమాత్మ సృష్టించిన లోకంలోనే ఉంది. కోయిల నాదంలో, కురిసే చినుకులో, పూసే పూవులో, చిన్నపిల్లల మాటల్లో ఆ ఆనందాన్ని అనుభవించాలి. నిస్వార్థంగా ఇతరులకు చేసే సాయంలో లభించే సంతృప్తి ఎంతో గొప్పది.
News November 12, 2025
దేశవాళీ ఆడాల్సిందే.. RO-KOకు బీసీసీఐ అల్టిమేటం?

కోహ్లీ, రోహిత్ వన్డే భవిష్యత్తుపై BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని, లేదంటే జట్టులో చోటు కష్టమేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తాను విజయ్ హజారే ట్రోఫీలో ఆడతానని హిట్మ్యాన్ MCAకు సమాచారం అందించినట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. కోహ్లీ ఆడటంపై ఇంకా క్లారిటీ రాలేదు. T20, టెస్టులకు వీడ్కోలు పలికిన RO-KO వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే.


