News January 25, 2025

మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి: CBN

image

AP: థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనేది తమ నినాదమని CM CBN తెలిపారు. ‘ప్రపంచంలోని గొప్ప కంపెనీలన్నీ దావోస్‌కు వస్తుంటాయి. అక్కడికి వెళ్లడం వల్ల ప్రతినిధులను కలిసే అవకాశం వస్తుంది. మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి. సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తయారుచేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మనవాళ్లు గొప్పస్థాయిలో ఉన్నారు. ధ్వంసమైన AP బ్రాండ్‌ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నాం’ అని అన్నారు.

Similar News

News February 19, 2025

కుంభమేళాతో రూ.3లక్షల కోట్ల వ్యాపారం: CAIT

image

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాతో రూ.3లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ అంచనా వేశారు. దేశంలోనే ఇదో అతిపెద్ద ఎకనామిక్ ఈవెంట్‌ అన్నారు. దీంతో స్థానిక వ్యాపారాలు పుంజుకున్నాయన్నారు. డైరీస్, క్యాలెండర్లు, జూట్ బ్యాగులు, స్టేషనరీ, ఫుడ్, పానీయాలు, పూజా సామగ్రి, హోటల్, వస్త్ర, రవాణా, కళాకృతులకు డిమాండ్ పెరిగిందన్నారు. కాశీ, అయోధ్యకూ ఈ క్రేజ్ పాకిందని పేర్కొన్నారు.

News February 19, 2025

Stock Markets: బ్రాడర్ ఇండెక్సుల జోరు..

image

బెంచ్‌మార్క్ సూచీలు నేడు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 22,932 (-12), సెన్సెక్స్ 75,939 (-28) వద్ద ముగిశాయి. ఉదయం లాభాల్లో చలించిన సూచీలు క్రమంగా పతనమయ్యాయి. ఇంట్రాడే కనిష్ఠం నుంచి పుంజుకొని ఫ్లాటుగా క్లోజయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, మెటల్, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు ఎగిశాయి. ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు నష్టపోయాయి. BEL, హిందాల్కో, ఐచర్, యాక్సిస్ బ్యాంక్, LT టాప్ గెయినర్స్.

News February 19, 2025

అలాంటి వారికే పదవులు: మంత్రి లోకేశ్

image

AP: మంచి చేస్తున్న ప్రభుత్వంపై YCP దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని TDP శ్రేణులకు మంత్రి లోకేశ్ సూచించారు. తిరుపతి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన, పార్టీని బలోపేతం చేసేందుకు ఐకమత్యంగా కృషి చేయాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు అంకితభావంతో పనిచేశారో తెలుసుకుని వారికే పదవులు ఇస్తామన్నారు. ‘ఎన్నికల్లో గెలిచాం.. తిరుగులేదనే ధోరణి సరికాదు. నిత్యం ప్రజల్లో ఉండాలి’ అని సూచించారు.

error: Content is protected !!