News November 21, 2024
సీఈవో కావాలి.. మైనస్ రూ.100 కోట్లిస్తాం: ఆస్ట్రోటాక్ ఫౌండర్
చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉద్యోగానికి ఓపెనింగ్స్ ఉన్నాయని, సెలక్ట్ అయినవారు రూ.20 లక్షలు ఎదురు చెల్లించాలని జొమాటో CEO దీపిందర్ గోయల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. ఆస్ట్రోటాక్ సంస్థ వ్యవస్థాపకుడు పునీత్ గుప్తా తాజాగా దీపిందర్‌పై సెటైర్ వేశారు. తమ సంస్థకు CEO కావాలని, తొలి ఏడాది మైనస్ రూ.వంద కోట్లు జీతం ఇస్తామని ప్రకటించారు. దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Similar News
News December 9, 2024
ఏడాదికి రూ.2కోట్ల జీతం
TG: వికారాబాద్(D) బొంరాస్‌పేట(M) తుంకిమెట్లకు చెందిన సయ్యద్ అర్బాజ్ ఖురేషి జాక్‌పాట్ కొట్టారు. 2019లో IIT పట్నాలో బీటెక్ పూర్తి చేసిన ఇతను 2023లో AI, మెషీన్ లెర్నింగ్‌లో MS పట్టా పొందారు. MSలో చూపిన ప్రతిభ ఆధారంగా దిగ్గజ సంస్థ అమెజాన్ అమెరికాలో అప్లైడ్ సైంటిస్టుగా రూ.2కోట్ల వార్షిక వేతనానికి ఎంపిక చేసింది. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఖురేషి యువతకు సూర్ఫినివ్వాలని అతని తండ్రి ఆకాంక్షించారు.
News December 9, 2024
కష్టాల్లో ఉన్న స్నేహితులకు రష్యా ద్రోహం చేయదు: రాయబారి
సిరియాలో తిరుగుబాటుతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు వెళ్లిపోయారు. ఈ ఉదంతంపై వియన్నాలోని అంతర్జాతీయ సంస్థల రష్యన్ ఫెడరేషన్ శాశ్వత ప్రతినిధి మిఖాయిల్ ఉలియానోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అసద్, అతని కుటుంబం మాస్కోకు చేరుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్నేహితులకు రష్యా ఎప్పుడూ ద్రోహం చేయదు. ఇదే రష్యా-అమెరికాకు మధ్య ఉన్న వ్యత్యాసం’ అని రాసుకొచ్చారు.
News December 9, 2024
చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురు
TG: వేములవాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన జర్మన్ పౌరుడేనని కోర్టు తేల్చింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. విచారణ సందర్భంగా ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.30లక్షల జరిమానా విధించింది. నెల రోజుల్లో ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్ సర్వీస్ అథారిటీకి రూ.5లక్షలు చెల్లించాలని పేర్కొంది.