News December 8, 2024
యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నాం: జెలెన్స్కీ

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్ అధినేత మేక్రాన్తో జెలెన్స్కీ సమావేశమయ్యారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని వీలైనంత త్వరగా, న్యాయమైన మార్గంలో ముగించాలని తామంతా కోరుకుంటున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడం, ప్రజల భద్రతపై చర్చించినట్లు పేర్కొన్నారు. వార్ ముగింపు విషయంలో ట్రంప్ దృఢ నిశ్చయంతో ఉన్నారన్నారు. భవిష్యత్తులోనూ తాము కలిసి పనిచేస్తామని చెప్పారు.
Similar News
News November 3, 2025
ఒకేరోజు రూ.2వేలు పెరిగిన సిల్వర్ రేటు

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 పెరిగి రూ.1,23,170కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 ఎగబాకి రూ.1,12,900 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.2,000 పెరిగి రూ.1,68,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 3, 2025
కాసేపట్లో ఘటనాస్థలికి మంత్రి పొన్నం

TG: మీర్జాగూడ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాసేపట్లో ఆయన ఘటనాస్థలికి చేరుకోనున్నారు. మీర్జాగూడ ఘటన కలిచివేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
News November 3, 2025
పశువుల్లో క్షయ వ్యాధి.. ఇలా గుర్తించండి

పశువుల్లో క్షయ వ్యాధి మైకోబాక్టీరియా వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు శ్వాస వదిలినప్పుడు, తుమ్మినప్పుడు.. మైకోబాక్టీరియా గాలిలో కలిసిపోతుంది. ఈ బాక్టీరియాతో కలుషితమైన మేత, నీరు, పాలను తాగడం వల్ల క్షయ వ్యాధి ఇతర పశువులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులు బరువు తగ్గుతాయి. ముక్కు నుంచి నీరు కారుతుంది. ఈ లక్షణాలు కనిపించిన జీవాలను ఇతర పశువుల నుంచి వేరు చేసి వెటర్నరీ నిపుణులకు చూపించాలి.


