News September 27, 2024

‘డాలీ చాయ్ వాలా’ ఉండటంతో మమ్మల్ని పట్టించుకోలేదు: హాకీ ప్లేయర్

image

దేశానికి మెడల్స్ తెచ్చినవారిని పక్కనపెట్టి ఇన్‌ఫ్లుయెన్సర్ ‘డాలీ చాయ్ వాలా’తో సెల్ఫీలు దిగేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. పారిస్ ఒలింపిక్స్‌లో మెడల్ సాధించి ఇండియాకు తిరిగొచ్చిన హాకీ ప్లేయర్లకు ఇదే అనుభవం ఎదురైంది. ‘హర్మన్‌ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్‌తో పాటు మరికొందరం ఎయిర్‌పోర్టులో ఉండగా అక్కడే డాలీ కనిపిస్తే మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇబ్బందిగా అనిపించింది’ అని ఓ హాకీ ప్లేయర్ చెప్పారు.

Similar News

News December 10, 2025

సౌదీలో నాన్ ముస్లింలకు లిక్కర్ విక్రయాలు!

image

సౌదీలో నాన్ ముస్లింలు లిక్కర్ కొనుగోలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెలకు 50వేల రియాల్స్(13,300డాలర్లు), అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికే ఈ వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. మద్యం కొనే టైంలో శాలరీ స్లిప్ చూపించాలనే నిబంధన పెట్టనుందట. ప్రస్తుతం రాజధాని రియాద్‌లో దేశం మొత్తానికి ఒకే ఒక లిక్కర్ షాపు ఉంది. భవిష్యత్తులో మద్యం షాపుల సంఖ్య పెరిగే ఛాన్సుంది.

News December 10, 2025

కేతకీ పుష్పాన్ని పూజలో ఎందుకు వినియోగించరు?

image

శివ పూజలో కేతకీ పుష్పం వాడరన్న విషయం తెలిసిందే! శివుని జ్యోతిస్తంభం ఆది, అంతాలను కనుగొన్నానని బ్రహ్మ అబద్ధం చెప్పడానికి ఈ పుష్పాన్నే సాక్ష్యంగా చూపాడట. అది అబద్ధపు సాక్ష్యమని గ్రహించిన శివుడు తన పూజలో ఈ పుష్పాన్ని వాడొద్దని శపించాడు. అందుకే శివపూజలో మొగలి పువ్వును వాడరు. అయినప్పటికీ శివ భక్తులు దీనిని తలలో ధరించవచ్చని, పూజా ప్రాంగణంలో అలంకారం కోసం ఉపయోగించవచ్చని పురోహితులు సూచిస్తున్నారు.

News December 10, 2025

శరీరంలో ఈ మార్పులు వస్తే జాగ్రత్త!

image

చాలా మంది కిడ్నీ సమస్యలను త్వరగా గుర్తించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వచ్చే కొన్ని మార్పులను గమనించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ లేదా రాత్రి వేళల్లో అతి మూత్రం, మూత్రంలో నురుగు/ఎర్రటి రంగు, ముఖం/పాదాలు లేదా శరీరం ఉబ్బినట్లు అనిపిస్తే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. బీపీ పెరుగుతున్నా కిడ్నీ సమస్యలుగా గుర్తించాలని చెబుతున్నారు.