News September 27, 2024
‘డాలీ చాయ్ వాలా’ ఉండటంతో మమ్మల్ని పట్టించుకోలేదు: హాకీ ప్లేయర్
దేశానికి మెడల్స్ తెచ్చినవారిని పక్కనపెట్టి ఇన్‌ఫ్లుయెన్సర్ ‘డాలీ చాయ్ వాలా’తో సెల్ఫీలు దిగేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. పారిస్ ఒలింపిక్స్‌లో మెడల్ సాధించి ఇండియాకు తిరిగొచ్చిన హాకీ ప్లేయర్లకు ఇదే అనుభవం ఎదురైంది. ‘హర్మన్‌ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్‌తో పాటు మరికొందరం ఎయిర్‌పోర్టులో ఉండగా అక్కడే డాలీ కనిపిస్తే మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇబ్బందిగా అనిపించింది’ అని ఓ హాకీ ప్లేయర్ చెప్పారు.
Similar News
News October 4, 2024
లడ్డూ వివాదంపై సుప్రీంలో నేడు విచారణ
తిరుమల లడ్డూ వివాదంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. నిన్ననే విచారణ జరగాల్సి ఉండగా సొలిసిటర్ జనరల్ తుషార్ అభ్యర్థన మేరకు ఇవాళ ఉదయం 10.30 గంటలకు వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. సిట్ దర్యాప్తును కొనసాగించాలా? లేదా స్వతంత్ర సంస్థలకు అప్పగించాలా? అనేది నేడు న్యాయమూర్తులు తేల్చనున్నారు.
News October 4, 2024
అమరావతి మీదుగా NH-16 విస్తరణ: పెమ్మసాని
AP: కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే NH-16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. వినుకొండ-గుంటూరు 2 లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించి మరో 25KM పొడిగించారన్నారు. ఇది రాజధాని అమరావతిని తాకేలా రూపొందిందని, దీనివల్ల ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా NHAI నిర్మిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, విద్యుత్ పనులు చేపడుతుందని తెలిపారు.
News October 4, 2024
మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్
దేశంలోని మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరాఠీ, బెంగాలీ, పాళీ, ప్రాకృత, అస్సామీ భాషలకు ఈ స్థాయిని కల్పించనుంది. దీంతో వీటితో కలిపి దేశంలోని సాంప్రదాయ భాషల సంఖ్య 11కు చేరనుంది. ఇప్పటివరకు తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలు మాత్రమే ఈ స్టేటస్‌ను కలిగి ఉన్నాయి.