News February 17, 2025
శక్తిమంతంగా ఉంటేనే లక్ష్యాన్ని సాధిస్తాం: మేరీకోమ్

ఏ లక్ష్యమైన సాధించాలంటే దానికి మానసికంగా, శారీరకంగా శక్తిమంతంగా ఉండాలని బాక్సర్ మేరికోమ్ అన్నారు. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో విద్యార్థుల సందేహాలకు సమాధానమిచ్చారు. ఒకరు సాధించిన విజయాన్ని మనమెందుకు చేరుకోలేమని అన్నారు. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ధైర్యంతోవాటిని ఎదుర్కొన్నానని తెలిపారు. మేరీకోమ్‌తో పాటు పారా ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ సుహాస్ యతిరాజ్ పాల్గొన్నారు
Similar News
News March 19, 2025
టెన్త్ పరీక్షలు రాసేవారికి అలర్ట్

TG: ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్‌తో పాటు సీరియల్ నంబర్‌ను ముద్రిస్తున్నారు. 24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్ ఇవ్వనున్నారు. అదనపు షీట్లు ఇవ్వరు. ఉ.9.30 గం.కు పరీక్ష ప్రారంభం కానుండగా 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. హాల్ టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
News March 19, 2025
అంతరిక్షం ఎంత ఎత్తులో ఉంటుందంటే?

భూమిపై ఎత్తును, లోతును కొలిచేందుకు సముద్ర మట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సముద్రమట్టానికి 100 కి.మీ లేదా 62 మైళ్ల ఎత్తు తర్వాత రోదసి(అంతరిక్షం) మొదలవుతుందని చాలా దేశాలు చెబుతున్నాయి. నాసా మాత్రం 80km నుంచే అంతరిక్షం మొదలవుతుందని అంటోంది. అయితే ఎక్కడి నుంచి మొదలవుతుందనే విషయమై ప్రామాణిక కొలమానమేమీ లేదు. 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు 118KM ఎత్తులో రోదసి మొదలవుతుందని తేల్చారు.
News March 19, 2025
రాత్రికి రాత్రే YSR పేరు తొలగించారు: వైసీపీ

AP: విశాఖపట్నంలో కూటమి నాయకుల ఉన్మాదం పతాక స్థాయికి చేరిందని వైసీపీ ఆరోపించింది. ‘వైజాగ్ క్రికెట్ స్టేడియానికి ఉన్న YSR పేరును టీడీపీ నేతలు తొలగించారు. రాత్రికి రాత్రే డా.వైఎస్సార్ ACA VDCA క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరును ACA VDCA క్రికెట్ స్టేడియంగా మార్చారు. గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్‌లోని లాన్‌కు ఉన్న వైఎస్సార్ పేరును కూడా తొలగించారు’ అని Xలో ఫొటోలు పోస్ట్ చేసింది.