News January 6, 2025

కేంద్రం సహకరిస్తే ట్రిలియన్ ఎకానమీ సాధిస్తాం: CM

image

TG: మెట్రో రైలు విస్తరణకు, ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సహకరించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ కోరారు. చర్లపల్లి టర్మినల్ ప్రారంభోత్సవంలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందని అన్నారు. చర్లపల్లి టర్మినల్ ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి డ్రై పోర్ట్ ఇవ్వాలని కోరారు.

Similar News

News January 20, 2025

‘పిల్లలతో పెద్దవారిని తిట్టిస్తే కామెడీనా?’.. నెట్టింట విమర్శలు

image

విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని బుల్లిరాజు క్యారెక్టర్ థియేటర్లలో నవ్వులు తెప్పించిందని చాలామంది చెప్తున్నారు. అయితే, కొందరు మాత్రం అలాంటి క్యారెక్టర్‌ను ఎంకరేజ్ చేయొద్దని విమర్శిస్తున్నారు. ‘పిల్లలతో పెద్దలను బూతులు తిట్టించడం కామెడీనా? ఇది చూసి పిల్లలతో కలిసి పెద్దలూ నవ్వుతున్నారు. మీ పిల్లలూ అలా తిడితే ఎలా?’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇంతకీ బుల్లిరాజు పాత్రపై మీ కామెంట్?

News January 20, 2025

బాయ్‌ఫ్రెండ్‌‌ను చంపిన గ్రీష్మకు ఉరిశిక్ష

image

కేరళలో ప్రియుడిని హత్య చేసిన గ్రీష్మకు నెయ్యట్టింకర కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఆమెకు సహకరించిన మామకు 3సం. జైలుశిక్ష పడింది. తనతో రిలేషన్ ముగించేందుకు శరణ్(23) ఒప్పుకోలేదని పెస్టిసైడ్ కలిపిన డ్రింక్ తాగించి చంపేసింది. గ్రీష్మ వయసు (2022లో 22సం.) దృష్ట్యా శిక్ష తగ్గించాలన్న లాయర్‌కు.. క్రూర నేరం, సాక్ష్యాలు చెరిపేసి, దర్యాప్తు తప్పుదోవ పట్టించిన ఆమె వయసును పరిగణించలేమని జడ్జి చెప్పారు.

News January 20, 2025

RGKar Verdict: వాదనలు ప్రారంభం

image

<<15186542>>కోల్‌కతా<<>> హత్యాచార దోషి సంజయ్‌కు శిక్ష ఖరారుపై కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేసిన CBI దోషికి ఉరి శిక్ష విధించాలని వాదిస్తోంది. అత్యంత క్రూర నేరానికి పాల్పడ్డ వ్యక్తికి ఇదే సరైన శిక్ష అని సీఎం మమతా బెనర్జీ సైతం కాసేపటి క్రితం కామెంట్ చేశారు. కాగా డిఫెన్స్ లాయర్ ఏం వాదించనున్నారో తెలియాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం 2గం. తర్వాత తీర్పు వచ్చే అవకాశముంది.