News June 4, 2024
రేపు తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం: రాహుల్

ఈ ఎన్నికల్లో మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి ఐక్యంగా కలిసి పని చేసిందన్నారు. దేశానికి మా కూటమి కొత్త విజన్ ఇచ్చిందని వివరించారు. రేపు కూటమి నేతల సమావేశం అనంతరం తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామని రాహుల్ పేర్కొన్నారు.
Similar News
News October 21, 2025
కళ్యాణ యోగం కల్పించే ‘కాళీ రూపం’

కంచి కామాక్షి ఆలయం వెనుక కాళీ కొట్టమ్లో ఆది కామాక్షి దేవి కొలువై ఉంటారు. పార్వతీ దేవియే ఇక్కడ కాళీమాత రూపంలో వెలిశారని చెబుతారు. ఈ ఆలయంలో అమ్మవారి రూపం శివలింగంపై కొలువై ఉంటుంది. అర్ధనారీశ్వర లింగంగా పూజలందుకుంటుంది. ఆదిశంకరాచార్యులు ఈ గుడిలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి, అమ్మవారి ఉగ్రత్వాన్ని శాంతింపజేశారని చెబుతారు. పెళ్లికాని వారు కామాక్షి దేవిని దర్శిస్తే కళ్యాణ యోగం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం.
News October 21, 2025
అరటిలో ఇనుము ధాతు లోపం – నివారణకు సూచనలు

అరటి మొక్కల్లో ఇనుము ధాతువు లోపించినప్పుడు అరటి చెట్టు లేత ఆకులు తెలుపు చారలతో ఉంటాయి. ఇనుప ధాతు లోపం అధికంగా ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెలుపు రంగుకు మారి క్రమేపి ఎండిపోతాయి. అరటి చెట్టు పెరుగుదల తగ్గిపోతుంది. లీటరు నీటికి అన్నభేధి 5 గ్రా., నిమ్మ ఉప్పు 2.5గ్రా. చొప్పున కలిపి.. అరటి ఆకులు పూర్తిగా తడిచేలా 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి ఇనుపధాతు లోపాన్ని నివారించవచ్చు.
News October 21, 2025
7,267 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ(OCT23). PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. ఉద్యోగాలను బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. DEC 13,14, 21తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్సైట్: https://nests.tribal.gov.in