News June 4, 2024

రేపు తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం: రాహుల్

image

ఈ ఎన్నికల్లో మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి ఐక్యంగా కలిసి పని చేసిందన్నారు. దేశానికి మా కూటమి కొత్త విజన్ ఇచ్చిందని వివరించారు. రేపు కూటమి నేతల సమావేశం అనంతరం తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామని రాహుల్ పేర్కొన్నారు.

Similar News

News November 12, 2024

APలో 6 ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీపై సర్వే

image

APలో 6 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల ఫీజిబిలిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయనుంది. కుప్పంలో 1501 ఎకరాలు, నాగార్జునసాగర్‌లో 1670, తాడేపల్లి గూడెం-1123, శ్రీకాకుళం-1383 ఎకరాలు, తుని-అన్నవరంలో 787 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రూ.2.27 కోట్లు విడుదల చేయనుంది.

News November 12, 2024

AP అసెంబ్లీ, మండలిలో విప్‌లు వీరే

image

☛ అసెంబ్లీ విప్‌లు: ఆదినారాయణ రెడ్డి, అరవ శ్రీధర్, బి.అశోక్, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నారాయణ నాయకర్, బోండా ఉమా, దాట్ల సుబ్బరాజు, దివ్య యనమల, థామస్. జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధవి రెడ్డప్పగారి, PGVR నాయుడు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్ రావు.
☛ మండలిలో విప్‌లు: చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, హరిప్రసాద్.
☛ <<14594795>>అసెంబ్లీ చీఫ్ విప్‌గా<<>> ఆంజనేయులు, మండలి చీఫ్ విప్‌గా అనురాధ నియామకం.

News November 12, 2024

బడ్జెట్ నిరాశపర్చింది: VSR

image

AP ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడికి నిరాశ కలిగించిందని YCP MP విజయసాయిరెడ్డి చెప్పారు. ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో బడ్జెట్‌లో చెప్పకపోవడం ప్రజలను మోసం చేయడమే. ప్రజా ప్రయోజనాలు చెప్పకుండా ఈ బడ్జెట్ ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి, వైసీపీపై నిందలతోనే నిండిపోయింది. చంద్రబాబు బడ్జెట్ స్వీయపొగడ్తలతో ఒక రాజకీయ కరపత్రంగా మిగిలింది’ అని Xలో విమర్శలు గుప్పించారు.