News November 11, 2024

అయోధ్య రామ మందిరంపై దాడి చేస్తాం: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ

image

అయోధ్య రామ మందిరం స‌హా ప‌లు ఆల‌యాల‌పై దాడి చేస్తామ‌ని ఖలిస్థానీ ఉగ్రవాది గురుప‌త్వంత్ సింగ్ హెచ్చ‌రించాడు. Nov 16-17 తేదీల్లో ఈ దాడులు చేస్తామంటూ వీడియో విడుదల చేశాడు. దీన్ని కెన‌డాలోని బ్రాంప్ట‌న్‌లో రికార్డు చేశాడు. హింసాత్మ‌క హిందుత్వ భావ‌జాలం పుట్టిన అయోధ్య పునాదులు క‌దుపుతామ‌ని హెచ్చ‌రించాడు. పన్నూపై గతంలోనే అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. US, కెనడా నుంచి భారత్‌పై అతను విషం చిమ్ముతున్నాడు.

Similar News

News December 2, 2024

ప్రపంచ మేధావుల సరసన 10 ఏళ్ల బాలుడు

image

లండన్‌లో నివసించే భారతీయ మూలాలున్న 10ఏళ్ల క్రిష్ అరోరా IQలో ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్‌, స్టీఫెన్ హాకింగ్స్‌ను దాటేశాడు. పియానో వాయించడంలో గ్రేడ్ 7 సర్టిఫికెట్ సాధించిన అతను, చెస్ కూడా బాగా ఆడగలడు. మానవ మేధస్సును కొలిచే ఐక్యూ(intelligence quotient)లో 162 సాధించి ఔరా అనిపించాడు. దీంతో ప్రపంచంలోని అత్యంత మేధావులైన 1శాతం మందిలో క్రిష్ నిలిచాడు. అటు, ఐన్‌స్టీన్ IQ 160గా చెబుతుంటారు.

News December 2, 2024

ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్

image

TG: ఏటూరు నాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పౌర హక్కుల సంఘం నేతలు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరగనుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే.

News December 2, 2024

దేవేంద్రుడికే మహా పట్టాభిషేకం?

image

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇవాళ లేదా మంగళవారం BJP శాసనసభాపక్ష నేతగా ఆయన్ను ఎన్నుకునే అవకాశం ఉందన్నారు. గత అనుభవం, పార్టీ గెలుపులో కీలకం, RSS మద్దతు వంటివి మాజీ సీఎంకు కలిసొచ్చే అంశాలు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అమిత్ షా నేడు ఖరారు చేస్తారని తెలిసిందే.