News March 23, 2025
BJP మెడలు వంచి తీరుతాం: కేటీఆర్

TG: బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు పెంచి, దక్షిణాదిలో తగ్గించే కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ మెడలు వంచైనా ఇక్కడ సీట్లు పెంచుకుంటామని చెప్పారు. ‘డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. సౌత్ స్టేట్స్ ఏం తప్పు చేశాయి? జనాభా నియంత్రణ పాటించినందుకా ఈ శిక్ష? దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News April 22, 2025
పోప్ డెత్ రిపోర్ట్‌లో ఏముందంటే?

పోప్ ఫ్రాన్సిస్ నిన్న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. గుండెపోటుతోనే ఆయన మృతిచెందినట్లు వాటికన్ డాక్టర్ ఆండ్రియా విడుదల చేసిన డెత్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. చనిపోయేముందు ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిపారు. కాగా శుక్రవారం లేదా ఆదివారం అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. ఎలాంటి ఆడంబరం లేకుండా మట్టిలో పూడ్చాలని, ఇన్‌స్క్రిప్షన్‌పై తన పేరును లాటిన్ భాషలో రాయాలని ఆయన ముందుగానే చెప్పినట్లు తెలుస్తోంది.
News April 22, 2025
BREAKING: మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు

హీరో మహేశ్ బాబుకు ED నోటీసులు పంపింది. రియల్ ఎస్టేట్ సంస్థలు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు హాజరుకావాలంది. ఈ కంపెనీలు ఒకే భూమిని వివిధ వ్యక్తులకు అమ్మి మోసం చేసినట్లు ఇటీవల ED సోదాల్లో తేలింది. ఈ సంస్థలకు ప్రమోషన్ చేసినందుకు మహేశ్ బాబు రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు గుర్తించింది. పెట్టుబడులు పెట్టేందుకు సామాన్యులను ఇన్‌ఫ్లుయెన్స్ చేశారని ఆయనపై అభియోగం మోపింది.
News April 22, 2025
డ్రైవర్ డోర్ డెలివరీ కేసు పునర్విచారణ

AP: కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో పునర్విచారణకు కాకినాడ SP బిందు మాధవ్ ఆదేశించారు. విచారణ అధికారిగా IPS అధికారిని నియమించారు. 60 రోజుల్లో విచారణ నివేదిక అందజేయాలన్నారు. 2022 మే 19న YCP MLC అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం సంచలనమైంది. అప్పటి ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చిందనే ఆరోపణలు వచ్చాయి.