News February 12, 2025
పృథ్వీ సినిమాలన్నీ బాయ్‌కాట్ చేస్తాం.. వైసీపీ హెచ్చరిక

AP: వైసీపీ శ్రేణులను పరుష పదజాలంతో <<15433971>>దూషించిన<<>> నటుడు పృథ్వీపై వైసీపీ అధికార ప్రతినిధి వెంకట రెడ్డి కారుమూరు మండిపడ్డారు. ‘తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని చాలా పద్ధతిగా చెబుతున్నాం. కామ కుక్క పృథ్వీకి ఏ సినిమాలో అవకాశం ఇచ్చినా, ఏ సినిమా ఫంక్షన్‌కు అతణ్ని పిలిచినా ఆ సినిమాను బాయ్‌కాట్ చేస్తాం. అలానే ఆ నిర్మాత, ఆ హీరోల అన్ని మూవీలను పద్ధతి ప్రకారం బాయ్‌కాట్ చేస్తాం’ అని హెచ్చరించారు.
Similar News
News March 22, 2025
కేకేఆర్ టీమ్‌కు షారుఖ్ ఖాన్ సందేశం

ఈరోజు తొలిమ్యాచ్ ఆడనున్న డిఫెండింగ్ ఛాంపియన్స్ KKRకు ఆ జట్టు యజమాని షారుఖ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ‘మీ అందరిపై దేవుడి కరుణ ఉండాలి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని చక్కగా చూసుకుంటున్న చంద్రకాంత్ గారికి థాంక్స్. కొత్తగా జట్టులో చేరిన వారికి వెల్‌కమ్. ఈ సీజన్‌లో మనల్ని నడిపించనున్న అజింక్యకు ధన్యవాదాలు. మీ అందరికీ ఈ టీమ్ ఇల్లులా మారుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.
News March 22, 2025
డీఎంకే ఆహ్వానించింది.. వెళ్లలేదు: జనసేన

AP: నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో DMK నిర్వహించిన సమావేశానికి తమకు ఆహ్వానం అందిందని జనసేన వెల్లడించింది. అయితే వేర్వేరు కూటములలో ఉన్నందున హాజరుకాలేదని తెలిపింది. పార్టీ అధ్యక్షుడు పవన్ సూచన మేరకు DMKకు సమాచారం అందించామని పేర్కొంది. సమావేశంలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. డీలిమిటేషన్‌పై తమకు ఓ విధానం ఉందని, దీన్ని ఓ సాధికార వేదికపై వెల్లడిస్తామని ప్రకటించింది.
News March 22, 2025
నేనెప్పుడూ కులం, మతం పాటించలేదు: పవన్

AP: తాను సనాతన ధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాలను గౌరవిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ కులం, మతం పాటించలేదని చెప్పారు. కర్నూలు జిల్లా పూడిచర్లలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలోని బుడగ జంగాలకు న్యాయం చేస్తాం. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించా. ఇకపై ప్రతి జిల్లాలో పర్యటిస్తా. క్యాంపు ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలు పరిష్కరిచేందుకు కృషి చేస్తా’ అని ఆయన వ్యాఖ్యానించారు.