News September 13, 2024

వారిని సురక్షితంగా తీసుకొస్తాం: లోకేశ్

image

కేదార్‌నాథ్‌లో 18 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్న <<14089394>>ఘటనపై <<>> ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘వారిని స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నాం. ఈలోగా వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరాం. యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండండి’ అని భరోసా ఇచ్చారు.

Similar News

News July 8, 2025

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: లోకేశ్

image

APలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని మంత్రి లోకేశ్ అన్నారు. బెంగళూరులో GCC గ్లోబల్‌లీడర్లతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా AI, క్వాంటమ్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ‘USA సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. 6 నెలల్లో ఇది అందుబాటులోకి వస్తుంది. టెక్నాలజీలో క్వాంటమ్ వ్యాలీ గేమ్‌ఛేంజర్‌గా నిలవనుంది. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రాయితీలు ఇస్తున్నాం’ అని తెలిపారు.

News July 8, 2025

సోషల్ మీడియా స్నేహితులను నమ్ముతున్నారా?

image

TG: సోషల్ మీడియాలో పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచించారు. అందమైన ప్రొఫైల్స్ చూసి, వారిని నమ్మి పెట్టుబడులు పెట్టొద్దని Xలో తెలిపారు. గోల్డ్, ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ వంటి వాటిలో రూ.లక్షలు సంపాదించవచ్చనే మాటల్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మోసపోతారన్నారు. పెట్టుబడి అనేది కీలకమని, అపరిచితుల్ని నమ్మి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సున్నితంగా హెచ్చరించారు.

News July 8, 2025

మోస్ట్ వ్యాల్యుబుల్ టీమ్‌గా RCB

image

ఐపీఎల్‌ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మోస్ట్ వ్యాల్యుబుల్ టీమ్‌గా అవతరించింది. ఈ ఏడాది 12.2 శాతం విలువ పెరిగి $269 మిలియన్లతో అత్యంత విలువైన జట్టుగా నిలిచింది. $249 మిలియన్లతో MI రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత $235 మిలియన్లతో CSK మూడో స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యు రూ.1.58 లక్షల కోట్లుగా ఉంది.