News July 3, 2024
3 నెలల్లో 1.28 లక్షల ఇళ్లు నిర్మిస్తాం: మంత్రి పార్థసారథి
AP: వచ్చే 3 నెలల్లో 1.28 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ఇందుకోసం రూ.2,520 కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 8.02 లక్షల గృహాలను వచ్చే మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందని, అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఆదేశించారు.
Similar News
News October 7, 2024
DMK vs పవన్ కళ్యాణ్
డీఎంకే, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇటీవల తిరుపతి పర్యటనలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం, ఉదయనిధి స్టాలిన్‌కు కౌంటర్ వేయడంపై డీఎంకే ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. బీజేపీ, అన్నాడీఎంకే కోసం పవన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు పవన్‌పై అడ్వకేటుతో ఫిర్యాదు చేయించడం, ప్రకాశ్ రాజ్‌తో ట్వీట్లు పెట్టించడం DMK పనేనని జనసైనికులు ఆరోపిస్తున్నారు.
News October 7, 2024
రూ.14వేల ఇసుక రూ.21వేలకు చేరింది: బొత్స
AP: రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పని లేక కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ హయాంలో విశాఖలో 10 టన్నుల ఇసుక రూ.14వేలకు దొరికేదని, ప్రస్తుతం అది రూ.21వేలకు చేరిందని విమర్శించారు. కూటమి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని ఫైరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు, పవన్ ఆపాలని డిమాండ్ చేశారు.
News October 7, 2024
మూడు పూటల కష్టం.. ఫలితం 33 పైసలు
వినియోగదారులు చెల్లించే ధరలో కూరగాయలు, పండ్ల రైతులు 30% మాత్రమే పొందుతున్నారని RBI ఓ రిపోర్టులో పేర్కొంది. అంటే మనం KG ₹100కు కొంటే వారికి ₹30 దక్కుతోంది. మిగతాది దళారులు, టోకు వర్తకులు, రిటైల్ వ్యాపారులు వంటి వారికి వెళ్తోంది. కొన్ని పంటలు చూస్తే టమాటాలకు 33%, ఆలూ- 37%, అరటి- 31%, మామిడి: 43%, ద్రాక్ష: 35% చొప్పున శ్రమజీవికి చెందుతోంది. ఇక డెయిరీ, గుడ్ల రైతులకు మాత్రం ఇది 70%, 75% కావడం గమనార్హం.