News April 21, 2024

పేదలకు 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తాం: కిషన్ రెడ్డి

image

TG: వచ్చే ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో BJP ముందుకెళ్తోందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మారుస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా అవినీతిని, బంధుప్రీతిని వదిలిపెట్టలేదని విమర్శించారు. HYD BJP ఆఫీస్‌లో సంకల్ప పత్రాన్ని ఆయన విడుదల చేశారు.

Similar News

News October 15, 2024

గురుకులాలను శాశ్వతంగా మూసివేసేందుకు కుట్ర?: KTR

image

TG: రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే గురుకులాలను శాశ్వతంగా మూసివేసే కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోందని KTR అన్నారు. అద్దె చెల్లించకపోవడంతో గురుకులాలకు యజమానులు తాళాలు వేయడంపై ఆయన Xలో స్పందించారు. ‘ఢిల్లీకి మూటలు పంపేందుకు డబ్బులున్నాయి. కమిషన్లు వచ్చే బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు రూ.వేల కోట్లు ఉన్నాయి. కానీ గురుకులాల అద్దెలు చెల్లించడానికి డబ్బులు లేవా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

News October 15, 2024

పన్నూన్ హత్యకు కుట్ర: US వెళ్లిన భారత ఇన్వెస్టిగేషన్ టీమ్

image

ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌పై హత్యాయత్నం కేసులో భారత అధికారి జోక్యాన్ని దర్యాప్తు చేసేందుకు భారత బృందం అమెరికాకు వెళ్లింది. ప్రధాన నిందితుడు నిఖిల్ గుప్తాతో పాటు ఆ అధికారి ఇతర సంబంధాలను పరిశీలించనుంది. ఈ మేరకు భారత్ తమకు సమాచారం ఇచ్చిందని US స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. న్యూయార్క్‌లో పన్నూన్ హత్యకు వీరిద్దరూ కుట్ర పన్నారని అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

News October 15, 2024

BREAKING: ఎన్నికల్లో ఫ్రీబీస్.. కేంద్రం, ECIకి సుప్రీం కోర్టు నోటీసులు

image

ఎలక్షన్ల ముంగిట రాజకీయ పార్టీలిచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణిస్తూ ఆదేశాలివ్వాలన్న పిల్‌పై ముందడుగు పడింది. కేంద్రం, ECIకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇదే అంశంపై నమోదైన పెండింగ్ కేసులనూ ఈ పిటిషన్‌కు ట్యాగ్ చేసింది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా వెంటనే పటిష్ఠ చర్యలు తీసుకొనేలా ECIకి ఆదేశాలివ్వాలని పిటిషన్‌దారులు సుప్రీం కోర్టును కోరారు. విచారణపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.