News November 16, 2024

పేదలకు 3 సెంట్లలో ఇళ్లు నిర్మిస్తాం: చంద్రబాబు

image

AP: ఇళ్లు లేని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లలో ఇళ్లు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏడాదిలో లక్ష ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసేలా ప్లాన్ చేశామని చెప్పారు. ‘రాత్రికి రాత్రే అన్ని పనులు చేస్తామని మేం చెప్పడం లేదు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో విధ్వంసం జరిగింది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుదలతో కృషి చేస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News December 6, 2024

రికార్డు సృష్టించిన బుమ్రా

image

టీమ్ ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించారు. అడిలైడ్‌లో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో ఖవాజాను ఔట్ చేయడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించారు. దీంతో భారత టెస్టు చరిత్రలో ఒకే ఏడాదిలో 50 టెస్టు వికెట్లు తీసిన మూడో ఫాస్ట్ బౌలర్‌గా ఆయన నిలిచారు. గతంలో కపిల్ దేవ్, జహీర్ ఖాన్ ఈ ఘనత సాధించారు.

News December 6, 2024

పుష్ప-2 తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

image

పుష్ప-2 సినిమాకు తొలిరోజు రూ.294 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. భారత సినీ చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొంది. ALL TIME RECORD అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. హిందీలో ఈ సినిమాకు ఫస్ట్ డే రూ.72కోట్ల వసూళ్లు వచ్చినట్లు ఇప్పటికే ప్రకటించింది.

News December 6, 2024

MSPతోనే పంటల కొనుగోలు: కేంద్రం

image

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను MSPతో కొనేందుకు మోదీ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో తెలిపారు. 2019 నుంచి పంట ఉత్ప‌త్తుల‌ ఖ‌ర్చులో 50% రైతుల‌కు లాభం చేకూర్చేలా MSPని లెక్కిస్తున్నామ‌ని తెలిపారు. రుణ‌మాఫీ అవ‌స‌రం లేకుండా రైతుల ఆదాయం పెంపు, న‌ష్టాల స‌మ‌యంలో ప‌రిహారం వంటి చ‌ర్య‌ల‌తో ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. అయితే రైతులు MSPకి చట్టబద్ధత డిమాండ్ చేస్తున్నారు.