News October 2, 2024
కాల్ మనీ దందాపై ఉక్కుపాదం మోపుతాం: హోం మంత్రి
AP: కాల్ మనీ దందాపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు, అక్రమ వసూళ్లతో ప్రజల్ని వేధించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. వసూళ్ల పేరుతో మహిళలను వేధింపులకు గురి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లే టార్గెట్‌గా సాగించే వడ్డీ వ్యాపారాలను సీరియస్‌గా తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు.
Similar News
News October 7, 2024
5Gపై ఫోకస్ తగ్గించిన రిలయన్స్ JIO
JIO 5G నెట్‌వర్క్ విస్తరణ వేగాన్ని తగ్గిస్తోంది. 4G యూజర్లు ఎక్కువ డబ్బులు చెల్లించే సేవలకు అప్‌గ్రేడ్ అవ్వడంపై ఫోకస్ పెట్టింది. Airtel సైతం ఫీచర్ ఫోన్లు వాడేవారిని స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. ఇవి వేగం పుంజుకొనేంత వరకు అవసరమైన 5G ఆపరేషన్స్ మాత్రమే కొనసాగిస్తాయని తెలిసింది. జియో 5G నెట్‌వర్క్ యుటిలైజేషన్ 15% ఉందని వెండర్స్, రెట్టింపు ఉంటుందని కంపెనీ సోర్సెస్ అంటున్నాయి.
News October 7, 2024
అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు భారీ వర్షాలు
ఏపీలో అల్పపీడన ప్రభావంతో ఇవాళ పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
News October 7, 2024
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది పూర్తి అయింది. 2023, అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. పిల్లలు, యువతుల్ని బందీలుగా తీసుకెళ్లడంతో పాలస్తీనాలో IDF ఏరివేత మొదలు పెట్టింది. దీంతో లక్షలాది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. మధ్యలో బందీలను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నా హెజ్బొల్లా దూరడంతో వివాదం మరో టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధం స్థాయికి చేరింది.