News September 11, 2024
టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం: సీఎం రేవంత్
TG: టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ట్రైనీ ఎస్సైల పాసింగ్ పరేడ్‌లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. తెలంగాణ పునర్నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Similar News
News October 3, 2024
11న మద్యం షాపుల కేటాయింపు: ఎక్సైజ్ శాఖ
AP: రాష్ట్రంలో లాబీయింగ్‌కు తావు లేకుండా మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 11న లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, 12 నుంచి మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బార్‌ల లైసెన్స్ 2025 ఆగస్టు వరకు ఉండటంతో వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
News October 3, 2024
నాలుగు భాషల్లో ప్రసంగించిన పవన్
AP: ‘వారాహి’ డిక్లరేషన్ కార్యక్రమంలో నాలుగు భాషల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది. జాతీయ మీడియాకు అర్థమవ్వాలంటూ ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఆయన ప్రసంగించారు. దీంతో పాటు తమిళంలోనూ ఆయన మాట్లాడారు. ఇక తెలుగులోనూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో పవన్‌కు బహు భాషల్లో ప్రావీణ్యం ఉందని ఆయన ఫాలోవర్స్ పోస్టులు చేస్తున్నారు.
News October 3, 2024
PM- RKVY స్కీమ్‌కు రూ.లక్ష కోట్ల మంజూరు
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకి రూ.లక్ష కోట్లను మంజూరు చేసింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్‌కు ఆమోదం తెలిపింది. రూ.10,103 కోట్లతో నూనెగింజల ఉత్పత్తికి నిర్ణయించింది. మరాఠీ, పాళీ, ప్రాకృత్, అస్సామీ, బెంగాలీ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా కల్పించింది. చెన్నై మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలిపింది.