News March 8, 2025
రిలయన్స్ నుంచి Rs24000 CR వసూలు చేస్తాం: కేంద్రమంత్రి

రిలయన్స్, దాని భాగస్వాముల నుంచి $2.81B (Rs.24000CR) వసూలు చేస్తామని PNG మంత్రి హర్దీప్‌సింగ్ పూరి అన్నారు. ప్రభుత్వానికి అన్ని హక్కులూ ఉన్నాయని కోర్టు చెప్పినట్టు గుర్తుచేశారు. ‘కోర్టు తీర్పు సుస్పష్టం. మేమిప్పటికే డబ్బు కోసం నోటీసులు పంపించాం. మా హక్కును వాడుకుంటాం’ అని తెలిపారు. హక్కుల్లేని నిక్షేపాల నుంచి అక్రమంగా గ్యాస్‌ను వెలికితీసిన కేసులో ఢిల్లీ హైకోర్టు RILకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.
Similar News
News March 17, 2025
నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. ALL THE BEST

AP: నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్ష ఉంటుంది. ఉ.8.45 గం. నుంచే సెంటర్లలోకి అనుమతిస్తారు. 6.49 లక్షల మంది విద్యార్థుల కోసం 3,450 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
*Way2News తరఫున ALL THE BEST
News March 17, 2025
ఓపెన్ టెన్త్ ఎగ్జామ్స్ కూడా నేటి నుంచే..

AP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే పదో తరగతి (ఓపెన్ టెన్త్) పరీక్షలు కూడా నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. రెగ్యులర్ పరీక్షలు జరిగే తేదీలు, సమయాల్లోనే ఈ ఎగ్జామ్స్ ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఓపెన్ టెన్త్ పరీక్షలు ఈ నెల 28తో ముగియనున్నాయి. మొత్తం 30,334 మంది కోసం 471 సెంటర్లను ఏర్పాటు చేశారు.
News March 17, 2025
చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

చంద్రుడిపై పరిశోధనలు చేపట్టే చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-2లో 25 KGల బరువు ఉన్న రోవర్ ‘ప్రజ్ఞాన్’ను జాబిల్లిపైకి తీసుకెళ్లగా, చంద్రయాన్-5లో 250 కేజీల రోవర్‌ను తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని జపాన్ సాయంతో నిర్వహిస్తామన్నారు. ఇక జాబిల్లిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు 2027లో చంద్రయాన్-4 మిషన్‌ను ప్రయోగిస్తామని చెప్పారు.