News November 19, 2024
రుణమాఫీని పూర్తి చేస్తాం: సీఎం రేవంత్

TG: రూ.2లక్షలలోపు రుణమాఫీ రైతులందరికీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ హనుమకొండ సభలో వెల్లడించారు. ‘సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదు. సమస్యలు పరిష్కరించి అందరికీ రుణమాఫీ పూర్తి చేస్తాం. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే రుణమాఫీకి రూ.18వేల కోట్లు కేటాయించాం. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపు రూ.2లక్షలలోపు రుణమాఫీ నిధులు విడుదల చేశాం’ అని చెప్పారు.
Similar News
News November 27, 2025
PDPL: ‘పంచాయతీ ఎన్నికలు కట్టుదిట్టంగా నిర్వహించాలి’

పంచాయతీ ఎన్నికలను నిబంధనలకు అనుగుణంగా కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. తొలి విడతలో 99 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ నవంబర్ 27న విడుదల అవుతుంది. 27–29న నామినేషన్లు స్వీకరణ, 30న పరిశీలన, డిసెంబర్ 1న అప్పీలు, 2న పరిష్కారం, 3న ఉపసంహరణ. నామినేషన్ కేంద్రాల్లో 100 మీ. భద్రతా పరిమితి, టి-పోల్లో డేటా నమోదు తప్పనిసరి అని కలెక్టర్ తెలిపారు.
News November 27, 2025
ఆ బంగ్లాను రబ్రీదేవి ఖాళీ చేయరు: RJD

RJD చీఫ్ లాలూ భార్య రబ్రీదేవి ఉంటున్న నివాసాన్ని ఆమె ఖాళీ చేయరని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఆ పార్టీ బిహార్ చీఫ్ మంగానీ లాల్ మండల్ తెలిపారు. జీవితకాల నివాసం కింద ఆ బంగ్లాను కేటాయించినట్లు చెప్పారు. పట్నాలోని అన్నే మార్గ్లో CM నివాసం ఎదుట రబ్రీదేవి, లాలూ 2 దశాబ్దాలుగా ఉంటున్నారు. కాగా దాన్ని ఖాళీ చేసి హార్డింజ్ రోడ్ 39 బంగ్లాకు మారాలంటూ ఇటీవల నితీశ్ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా RJD స్పందించింది.
News November 27, 2025
హైడ్రాపై కర్ణాటక బృందం ప్రశంసలు

TG: హైడ్రా (HYDRAA) చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించిన కర్ణాటక ప్రతినిధులు ఈ మోడల్ను బెంగళూరుతో పాటు ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా పేర్కొన్నారు. బతుకమ్మకుంట, నల్లచెరువు వంటి పునరుద్ధరించిన చెరువులను పరిశీలించారు. ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణలో హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశంసించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో జరిగిన చర్చలో దీని అమలు విధానం, విభాగాల సమన్వయం గురించి తెలుసుకున్నారు.


