News March 13, 2025
టిడ్కో గృహాలను త్వరలోనే పూర్తిచేస్తాం: మంత్రి నారాయణ

AP: టిడ్కో ఇళ్ల అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం 22,640 ఇళ్లను తొలగించి వేరే వారికి కేటాయించిందని, 77,606 మందికి ఇళ్లు ఇవ్వకుండానే వారి పేరుపై రుణం తీసుకున్నారని తెలిపారు. బ్యాంకు బకాయిలకు ప్రభుత్వం రూ.140కోట్లకు అనుమతిచ్చిందని త్వరలోనే చెల్లిస్తామన్నారు. జూన్ 12 నాటికి పెండింగ్లో ఉన్న 365,430 చదరపు అడుగుల ఇళ్లను పూర్తి చేస్తామని తెలిపారు.
Similar News
News March 13, 2025
ఒంటిపూట బడులు.. ఉత్తర్వులు జారీ

తెలంగాణలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉ.8 నుంచి మ.12.30 గంటల వరకు స్కూళ్లు నడవనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో ఒంటి గంట నుంచి సా.5 వరకు తరగతులు నిర్వహిస్తారు. అటు ఏపీలోనూ ఎల్లుండి నుంచి ఒంటిపూట స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.
News March 13, 2025
మహిళలతో తప్పుడు ప్రవర్తన.. చెంప చెళ్లుమనిపించా: హీరో

మహిళలతో తప్పుగా ప్రవర్తించిన ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించానని హిందీ నటుడు గోవిందా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘2008లో సంతోష్ అనే అభిమాని నా కోసం సెట్స్కు వచ్చాడు. అతడు మహిళలతో తప్పుగా ప్రవర్తించడం చూసి చెంప మీద కొట్టాను. దీంతో అతడు నాపై కేసు పెట్టాడు. 9ఏళ్లపాటు ఆ కేసు సాగింది. ఎట్టకేలకు అతడిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఆధారాలు సంపాదించి కేసు గెలిచాను’ అని తెలిపారు.
News March 13, 2025
తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం

త్రిభాషా వివాదం నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ కాపీపై రూపీ సింబల్(₹)ను తొలగించింది. రూపీ సింబల్కు బదులు తమిళ ‘రూ’ అక్షరాన్ని పేర్కొంది.