News March 13, 2025

టిడ్కో గృహాలను త్వరలోనే పూర్తిచేస్తాం: మంత్రి నారాయణ

image

AP: టిడ్కో ఇళ్ల అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం 22,640 ఇళ్లను తొలగించి వేరే వారికి కేటాయించిందని, 77,606 మందికి ఇళ్లు ఇవ్వకుండానే వారి పేరుపై రుణం తీసుకున్నారని తెలిపారు. బ్యాంకు బకాయిలకు ప్రభుత్వం రూ.140కోట్లకు అనుమతిచ్చిందని త్వరలోనే చెల్లిస్తామన్నారు. జూన్ 12 నాటికి పెండింగ్‌లో ఉన్న 365,430 చదరపు అడుగుల ఇళ్లను పూర్తి చేస్తామని తెలిపారు.

Similar News

News April 17, 2026

పరుచూరి చెప్పిన జీవిత సూత్రం!

image

అతి మంచితనం, మొహమాటంతో ‘నో’ చెప్పలేకపోవడం వల్ల జీవితంలో అనేక చిక్కులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాటిచ్చి ఇబ్బందుల్లో పడేవారు చాలామంది. దీనిపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరికైనా మాట ఇచ్చేముందు పదిసార్లు ఆలోచించాలి. నోరు విప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమయానుకూలంగా NO చెప్పడం నేర్చుకోండి’ అని ఆయన సూచించారు.

News April 17, 2026

దేవుడి కంటే BCCI వద్దే ఎక్కువ డబ్బు.. అయినా: లలిత్ మోదీ

image

భారత్‌లో ఉన్న స్టేడియాలపై IPL ఫౌండర్ లలిత్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. BCCI వద్ద దేవుడి కంటే ఎక్కువ డబ్బు ఉందని, అయినా స్టేడియాల దుస్థితి మారట్లేదని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. BCCI వాటిని కూల్చేసి కొత్తవి నిర్మించాలని తెలిపారు. ఇక 2030 నాటికి IPLలో ఒక్కో అగ్రశ్రేణి ఆటగాడు రూ.150CR వరకు సంపాదిస్తారని జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఆటగాళ్లు దేశ జట్టు కంటే IPLకే ప్రాధాన్యతనిస్తారన్నారు.

News April 17, 2026

ట్రంప్‌ ప్రకటనలపై ఇరాన్ మీడియా ఎగతాళి!

image

ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్న <<19670282>>ట్రంప్ ప్రకటన<<>>లను ఆ దేశ మీడియా ఎగతాళి చేసింది. ట్రంప్ మాటలు ‘గాల్లో మేడలు కట్టడం’ లాంటివని ఎద్దేవా చేసింది. ట్రంప్ ఆశలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని పేర్కొంది. చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోయినా, ఒప్పందం జరిగిపోయిందంటూ ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేసింది. అలాగే యురేనియం అప్పగిస్తామన్న మాటల్లోనూ నిజం లేదని తెలిపింది.