News December 7, 2024
ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

AP: తమ హయాంలో 11 DSCల ద్వారా 1.50 లక్షల మంది టీచర్లను నియమించామని CM చంద్రబాబు తెలిపారు. ఖాళీ అయిన పోస్టులన్నింటినీ భర్తీ చేసేవాళ్లమన్నారు. ఇకపై ప్రతి ఏటా DSC నిర్వహిస్తామని, టైం టేబుల్ ప్రకారం నోటిఫికేషన్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి నియామకాలు పూర్తి చేసేందుకు లోకేశ్ చర్యలు తీసుకుంటారన్నారు. 16,347 టీచర్ పోస్టులతో మెగా DSCపై CM తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 3, 2025
VJA: నేడు సిట్ ముందుకు వైసీపీ నేతల కుమారులు

కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారులు నేడు విచారణకు హాజరు కానున్నారు. విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేశారు. జోగి రాజీవ్, రోహిత్ కుమార్, రాకేశ్, రామ్మోహన్‌కు నోటీసులు అందించారు. ఈ మేరకు గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వారు విచారణకు హాజరు కానున్నారు. లాప్‌టాప్‌లోని సమాచారం కోసం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
News December 3, 2025
మరో మైలురాయికి చేరువలో రోహిత్ శర్మ

టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. మరో 41 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 20వేల పరుగులు చేసిన 4వ భారత బ్యాటర్‌గా అవతరించనున్నారు. 503 మ్యాచ్‌లలో 42.46 సగటు, 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో 19,959 పరుగులు చేశారు. సచిన్ 34,357, కోహ్లీ 27,808, ద్రవిడ్ 24,064 రన్స్‌తో మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. కాగా సౌతాఫ్రికా, భారత్ మధ్య నేడు 2వ వన్డే జరగనుంది.
News December 3, 2025
4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం ప్రత్యేకత

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఇది ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది. దీనిలో తీపిదనం ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.


