News December 7, 2024
ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు
AP: తమ హయాంలో 11 DSCల ద్వారా 1.50 లక్షల మంది టీచర్లను నియమించామని CM చంద్రబాబు తెలిపారు. ఖాళీ అయిన పోస్టులన్నింటినీ భర్తీ చేసేవాళ్లమన్నారు. ఇకపై ప్రతి ఏటా DSC నిర్వహిస్తామని, టైం టేబుల్ ప్రకారం నోటిఫికేషన్‌లు ఇస్తామని హామీ ఇచ్చారు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి నియామకాలు పూర్తి చేసేందుకు లోకేశ్ చర్యలు తీసుకుంటారన్నారు. 16,347 టీచర్ పోస్టులతో మెగా DSCపై CM తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 16, 2025
విషాదం.. ప్రకృతి వైపరీత్యాలకు 3,200 మందికి పైగా మృతి
దేశంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా 3,200 మందికిపైగా మరణించినట్లు వాతావరణ వార్షిక నివేదిక-2024 పేర్కొంది. అత్యధికంగా 1,374 మంది పిడుగుపాటుకు గురై మరణించగా, వరదల వల్ల 1,287 మంది, వడదెబ్బ కారణంగా 459 మంది చనిపోయారని వెల్లడించింది. వరదలతో అత్యధికంగా కేరళలో, పిడుగుపాటుతో బిహార్‌లో మరణాలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు గత ఏడాది అత్యధిక ఉష్ణ సంవత్సరంగా నిలిచింది.
News January 16, 2025
కొత్త పథకాలు.. నేటి నుంచే ఫీల్డ్ సర్వే
TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తీసుకురానున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం నేటి నుంచి ఫీల్డ్ సర్వే చేయనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 21నుంచి 24 వరకు గ్రామసభలు, డేటా ఎంట్రీ చేయనున్నారు. దీని ఆధారంగా 25న తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.
News January 16, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) స్కీమ్ కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తేజస్, వందే భారత్, హంసఫర్ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రయాణ సమయంలో వేతనంతో కూడిన సెలవుతో పాటు టికెట్ ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.