News August 6, 2024
YCP ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగిస్తాం: సీఎం

AP: వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులను విధ్వంసం చేయాలన్న ఆలోచన తమకు లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘గతంలో టీడీపీ సర్కారు PPP విధానంలో పోర్టులను పూర్తిచేయాలనుకుంది. వైసీపీ ప్రభుత్వం వాటిని EPC(ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) విధానానికి మార్చింది. ఆ నిబంధనలు మారిస్తే ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల యథావిధిగా కొనసాగిస్తాం’ అని తెలిపారు.
Similar News
News December 5, 2025
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన సీఎం నితీశ్

బిహార్ CM నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఇటీవల పదోసారి CMగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్(లండన్)లో చేరినట్లు JDU తెలిపింది. 2000లో తొలిసారి CM అయిన నితీశ్ వారం రోజులే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి వరుసగా 5సార్లు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు.
News December 5, 2025
కప్పు పట్టేస్తారా? పట్టు విడుస్తారా?

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన IND 3 వన్డేల సిరీస్లో తొలి మ్యాచు గెలిచి ఊపు మీద కనిపించింది. దీంతో ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే అనుకున్నారంతా. కానీ బౌలింగ్ ఫెయిల్యూర్, చెత్త ఫీల్డింగ్తో రెండో వన్డేను చేజార్చుకుంది. దీంతో రేపు విశాఖలో జరిగే చివరి వన్డే కీలకంగా మారింది. మరి భారత ఆటగాళ్లు ఈ మ్యాచులో సమష్టిగా రాణించి, సిరీస్ పట్టేస్తారో లేక SAకు అప్పగిస్తారో చూడాలి.
News December 5, 2025
FEB 8 నుంచి శ్రీశైల బ్రహ్మోత్సవాలు

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని EO శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. క్యూలు, మంచినీరు, అటవీ ప్రాంతంలో నడకదారి భక్తులకు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. FEB 15న పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం, 16న స్వామి అమ్మవార్ల రథోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు.


