News August 6, 2024
YCP ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగిస్తాం: సీఎం

AP: వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులను విధ్వంసం చేయాలన్న ఆలోచన తమకు లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘గతంలో టీడీపీ సర్కారు PPP విధానంలో పోర్టులను పూర్తిచేయాలనుకుంది. వైసీపీ ప్రభుత్వం వాటిని EPC(ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) విధానానికి మార్చింది. ఆ నిబంధనలు మారిస్తే ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల యథావిధిగా కొనసాగిస్తాం’ అని తెలిపారు.
Similar News
News December 11, 2025
హనుమాన్ చాలీసా భావం – 35

ఔర దేవతా చిత్త న ధరయీ|
హనుమత సేయి సర్వ సుఖ కరయీ||
మహాబలశాలి, చిరంజీవి అయిన హనుమంతుడిని నిరంతరం తలచుకోవడం ద్వారా మనం అన్ని కష్టాలు, భయాల నుంచి విముక్తి పొంది, సకల సౌఖ్యాలను పొందుతాము. ఆంజనేయ స్వామిని నమ్మిన వారికి సర్వదా విజయమే కలుగుతుంది. ఆయనను భక్తితో ఆరాధించిన వారికి అన్ని రకాల సుఖాలు, సంతోషాలు, శుభాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 11, 2025
వేసవి కరెంటు కష్టాలు గట్టెక్కించేలా ‘యాదాద్రి’

TG: వేసవిలో విద్యుత్ డిమాండ్‌కు తగ్గ ముందస్తు ఏర్పాట్లు ప్రభుత్వం చేపట్టింది. 2026 FEB నాటికి ఉత్పత్తి జరిగేలా 4000 MW ‘యాదాద్రి’ ప్లాంటును సిద్ధం చేస్తోంది. అప్పటికల్లా GENCO దీని సింక్రనైజేషన్ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఉత్పత్తి ప్రారంభమైతే బయటినుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన భారం తప్పుతుంది. వేసవిలో గరిష్ఠ విద్యుత్ వినియోగం 17,500 MWగా ఉండగా ఈసారి 18000 MWకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
News December 11, 2025
శ్రవణ్ సాయి హత్య.. సంచలన ఆరోపణలు

కృష్ణా(D)కు చెందిన శ్రవణ్ సాయి <<18525669>>హత్య కేసులో<<>> మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. ‘ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. నా కూతురు గర్భవతి అని తెలిసింది. తప్పు చేసిందని ఆమెను కొట్టబోతుండగా అడ్డురావడంతో అతడికి దెబ్బలు తగిలాయి. ప్రెగ్నెన్సీ సంగతి అమ్మకు తెలిసిందని అతడికి నా కూతురు మెసేజ్ చేసిందట’ అని అమ్మాయి తల్లి తెలిపారు. శ్రవణ్‌ను టార్చర్ చేసి చంపారని, ఒంటిపై గాయాలున్నాయని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.


