News April 12, 2025

‘వనజీవి’ రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం: పవన్

image

AP: వనజీవి రామయ్య పర్యావరణ పరిరక్షణ కోసం ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కృషి చేసి, సుమారు కోటి మొక్కలు నాటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. పచ్చదనం పెంచడానికి రామయ్య, ఆయన సతీమణి చేసిన వన యజ్ఞం ఎన్నో తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిస్తుందన్నారు. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, పచ్చదనం పెంపునకు కృషి చేస్తామన్నారు.

Similar News

News April 18, 2025

నాకు గుడి కట్టండి: ఊర్వశి

image

స్పెషల్ సాంగ్స్‌తో ఫేమస్‌ అయిన ఊర్వశీ రౌతేలా దక్షిణాదిన తనకు గుడి కట్టాలని కోరారు. బద్రీనాథ్ దగ్గర్లో ఊర్వశీ ఆలయం ఉందని.. అక్కడ అందరూ తన ఆశీర్వాదం తీసుకుంటారని తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులైతే తన ఫొటోకు మాలలు వేసి భక్తిగా కొలుస్తారన్నారు. పనిలో పనిగా దక్షిణాదినా ఒక గుడి కడితే బాగుంటుందని ఆకాంక్షించారు. ఈ వ్యాఖ్యలు చూశాక ఊర్వశిని త్వరగా డాక్టర్లకు చూపించాలని నెటిజన్స్ ఫైరవుతున్నారు.

News April 18, 2025

దేశానికి ఆదర్శంగా నిలిచేలా బెట్టింగ్ వ్యతిరేక విధానం తెస్తాం: లోకేశ్

image

AP: బెట్టింగ్ యాప్స్‌ను నిషేధించాలని యూట్యూబర్ అన్వేష్ చేసిన ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘బెట్టింగ్ యాప్‌లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి బానిసైన వందలాది మంది హృదయ విదారక కథలను వింటున్నా. వీటిని ఆపేయాలి. నిరంతర అవగాహన, కఠినంగా వ్యవహరించడమే దీనికి దీర్ఘకాలిక పరిష్కారం. దేశానికే ఆదర్శంగా నిలిచేలా బెట్టింగ్ వ్యతిరేక విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News April 18, 2025

గర్భిణిని కాపాడిన ChatGPT

image

నార్త్ కరోలినాలోని(USA) షార్లెట్‌కు చెందిన నటాలియా టారియన్ అనే 8 నెలల గర్భిణికి ChatGPT చేసిన హెచ్చరిక ఆమె ప్రాణాలను కాపాడేలా చేసింది. తన దవడ బిగుతుగా అనిపిస్తోందని ఇందుకు కారణమేంటని నటారియా ChatGPTని అడగ్గా ఆమె బీపీని చెక్ చేసుకోవాలని తెలిపింది. బీపీ ఒక్కసారిగా పెరగడంతో వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాలని Ai సూచించింది. ఆస్పత్రిలో బీపీ 200/146గా ఉండటంతో వెంటనే ప్రసవం చేసి తల్లీబిడ్డను కాపాడారు.

error: Content is protected !!