News January 30, 2025
గెలవగానే టీడీపీ భరతం పడతాం: పెద్దిరెడ్డి

AP: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీకి వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం రాగానే టీడీపీ కార్యకర్తల భరతం పడతామని హెచ్చరించారు. తమపై తప్పుడు కేసులు పెట్టి దాడులు చేస్తున్నారని, దాడులకు ప్రతిదాడులు కచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు. తాము గెలవగానే తడాఖా చూపిస్తామన్నారు. కడప, రాయచోటి వైసీపీ సమన్వయ సభల్లో పెద్దిరెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
Similar News
News February 19, 2025
సెమిస్టర్ వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్: లోకేశ్

AP: ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వం రూ.4వేల కోట్ల రీఎంబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆర్థికంగా కుదుటపడ్డాక వాటిని చెల్లిస్తామని తిరుపతి పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన చెప్పారు. తాను జగన్‌పై చేసిన పోరాటం కంటే విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం 3రెట్లు అధికంగా చంద్రబాబుగారితో పోరాడుతున్నానని లోకేశ్ సరదాగా అన్నారు.
News February 19, 2025
కొత్త సీఎంకు మా మద్దతు ఉంటుంది: కేజ్రీవాల్

ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తాకు మాజీ సీఎంలు అర్వింద్ కేజ్రీవాల్, ఆతిశీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీల వల్లే ఈ అధికారం వచ్చిందని, ఆ హామీలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఢిల్లీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కొత్త సీఎంకు ప్రతి పనిలో అవసరమైన మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
News February 19, 2025
KCRకు ప్రతిపక్ష హోదా ఎందుకు?: TPCC చీఫ్

TG: ఫాం హౌస్‌కి పరిమితమైన KCRకు ప్రతిపక్ష హోదా ఎందుకు అని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా ఆయన తీరు మారలేదని, అధికారం కోసం గుంట నక్కలా ఎదురు చూసినా ఫలితం ఉండదని అన్నారు. ‘KCR పాలనకు INC పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటానికి KCRకు సిగ్గు ఉండాలి. గతంలో మా MLAలను చేర్చుకున్నప్పుడు మీ సోయి ఎటు పోయింది’ అని మండిపడ్డారు.