News June 26, 2024
ఏపీ అభివృద్ధికి సాధ్యమైనంత కృషి చేస్తాం: ప్రధాని మోదీ

AP: టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలు తనను కలవడంపై ప్రధాని మోదీ Xలో పోస్ట్ పెట్టారు. ‘టీడీపీకి చెందిన సభ్యులు కలిశారు. నా మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలో మా పార్టీలు కేంద్రంలో, ఏపీలో చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాయి. భారతదేశ ప్రగతికి, ఏపీ అభివృద్ధికి సాధ్యమైనదంతా చేస్తాం’ అని రాసుకొచ్చారు.
Similar News
News January 26, 2026
నేటి ముఖ్యాంశాలు

* 131 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
* అంతరిక్ష యాత్ర పూర్తిచేసిన శుభాంశు శుక్లాకు అశోక చక్ర
* అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం.. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం
* TG: సింగరేణి టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధం: కోమటిరెడ్డి
* నాంపల్లి అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి.. రూ.5 లక్షల చొప్పున పరిహారం
* సింగరేణిలో మిగిలిన స్కామ్‌లను బయటపెడతాం: హరీశ్ రావు
* న్యూజిలాండ్‌పై మూడో T20Iలో భారత్ విజయం
News January 26, 2026
T20Iల్లో టీమ్ ఇండియా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడిన సంగతి తెలిసిందే. 154 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా స్కోరు 19(3.1 ఓవర్లు) బంతుల్లోనే 50 దాటింది. T20Iల్లో భారత్‌కు ఇదే అత్యంత వేగమైన 50 కావడం విశేషం. 2023లో బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా 22(3.4 ఓవర్లు) బంతుల్లో ఫిఫ్టీ స్కోర్ చేసింది. 2021లో స్కాట్లాండ్‌పై, 2022లో ఆస్ట్రేలియాపై 3.5 ఓవర్లలో 50 స్కోర్ చేసింది.
News January 26, 2026
తిరుమలలో వైభవంగా రథ సప్తమి

AP: తిరుమల కొండపై రథ సప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. మలయప్పస్వామి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు విభిన్న వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి చంద్రప్రభ వాహన సేవ కొనసాగుతుండగా చిరు జల్లులు, వెలుగుల మధ్య ఏడుకొండలవాడు అద్వితీయంగా కనువిందు చేశారు. భక్తులు స్వామిని స్మరిస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను టీటీడీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.


